ఐసిడిఎస్ ఆధ్వర్యంలో పోషణ మాసం కార్యక్రమాలు
బోనకల్ : మధిర ఐసిడిఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని బోనకల్ 1 సెక్టార్ లోని పలు అంగన్వాడి కేంద్రాలలో పోషణ మాసం సందర్భంగా పోషకాహార వారోత్సవాలను నిర్వహిస్తున్నారు .ఈ సందర్భంగా శుక్రవారం బోనకల్ మండలంలోని చోప్పకట్లపాలెం గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో పోషణ మాసం సందర్భంగా తల్లి, పిల్లలకు పోషకాహారం యొక్క ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ ఎసి డిపిఓ కమల ప్రియ మాట్లాడుతూ పిల్లల
శారీరక, మానసిక ఎదుగుదలకు అవసరమైన కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రొటీన్లు, విటమిన్ల వంటి పోషకాలన్నీ అంగన్వాడీలో లభించే బాలామృతం , గుడ్లు, పాలు తదితర పదార్థాలలో ఉంటాయన్నారు. కావున గర్భిణీ స్త్రీలు ,పిల్లలు అంగన్వాడి కేంద్రాలను ఉపయోగించుకొని పోషకాహారాన్ని తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, తల్లులతో ర్యాలీ నిర్వహించి పిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ రమాదేవి, అంగన్వాడి టీచర్లు జయమ్మ, ఆశా రాణి , అంగన్వాడీ ఆయాలు తదితరులు పాల్గొన్నారు.