ఒకరి రక్తదానం.. మరొకరికి ప్రాణదానం..

కబడ్డీ అసోసియేషన్ జిల్లా చైర్మన్ జనార్దన్ రెడ్డి.
ఊరుకొండ, అక్టోబర్ 23 (జనంసాక్షి):
యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్త దానం చేయడం వల్ల ఒకరి రక్తదానం మరొకరికి ప్రాణదానం అవుతుందని కబడ్డీ మరియు కరాటే అసోసియేషన్ జిల్లా చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి అన్నారు. ఆదివారం కల్వకుర్తి డివిజన్ పోలీస్ స్టేషన్ లో పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. రక్తదాన శిబిరానికి నాగర్ కర్నూల్ జిల్లా కబడ్డి మరియు కరాటి అసోసియేషన్ చైర్మన్ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి(MJR) ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా ఊరుకొండ మండలం నుండీ యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. కార్యక్రమంలో సుదర్శన్, రాజయ్య, కృష్ణ గౌడ్, వీరారెడ్డి, నేతాజీ యువజన సంఘం అధ్యక్షులు హరీష్, సెక్రెటరీ సందీప్ కుమార్, అంబేద్కర్ యువజన సంఘం సెక్రెటరీ అరుణ్, చంద్రకాంత్, శ్రీశైలం, మరియు ఊరుకొండ యూత్ శివశంకర్, సాయి, శివ, శ్రీశైలం, అశోక్, అఖిలేష్, బాలకృష్ణ, చందు, శ్రీకాంత్, శేఖర్, చిరు, ప్రణీత్, లక్ష్మణ్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.