కమ్యూనిటీ పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

జహీరాబాద్ ఆగస్టు (జనంసాక్షి)కమ్యూనిటీ పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ జిల్లా కార్యాలయం పెద్దాపూర్ లో 75 వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించిన సి పి డబ్ల్యు ఏ జిల్లా కమిటీ సభ్యులు. సోమవారం జిల్లా కార్యాలయం ముందు జెండా ఆవిష్కరణ చేసిన గౌరవ అధ్యక్షులు డాక్టర్ జి వెంకట రెడ్డి ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పెద్దాపురం గ్రామ సర్పంచ్ బోయిని శ్రీనివాస్ మరియు గ్రామ పెద్దలు హాజరయ్యారు. అదేవిధంగా కమ్యూనిటీ పారా మెడికల్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు .అనిల్ కుమార్ , జిల్లా కన్వీనర్ డాక్టర్ టి ప్రభుదాస్ , జిల్లా కోశాధికారి డాక్టర్ సిహెచ్ హనుమంత్ , జిల్లా జనరల్ సెక్రెటరీ సుభాష్ నాయక్ , జిల్లా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ యస్ కృష్ణ కంది మండల అధ్యక్షులు డాక్టర్ రామకృష్ణ కొండాపూర్ మండల జనరల్ సెక్రటరీ భాస్కర్ సదాశివపేట మండలం నుండి ప్రసాద్, బాబు రావు, కోహిర్ మండలం జనరల్ సెక్రెటరీ రాములు సభ్యులు రమేష్ గమరియు ఆర్.ఎం.పి పి.ఎం.పి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.