కరీంనగర్‌లో ఒలంపిక్‌ రన్‌

కరీంనగర్‌,జూన్‌23(జ‌నం సాక్షి): కరీంనగర్‌ పట్టణంలోని అంబేడ్కర్‌ స్టేడియం వద్ద ఒలింపిక్‌ రన్‌ ను టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ ప్రారంభించారు. అంబేడ్కర్‌ స్టేడియం నుంచి తెలంగాణ చౌక్‌ వరకు ఈ రన్‌ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొడిగె శోభ, స్పోర్ట్స్‌ ప్రముఖులు, వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆడే విధంగా క్రీడాకారులను తీర్చిదిద్దాల్సిన అవసరం ఉందని ఎంపీ వినోద్‌ పేర్కొన్నారు. క్రీడాకారులకు ప్రభుత్వం నుంచి అన్ని విధాలా ప్రోత్సాహం ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.