కరీంనగర్‌లో తోఫా అందచేసిన ఎంపి వినోద్
కరీంనగర్,మే31(జనం సాక్షి):దేశంలోనే మత కలహాలు లేని రాష్ట్రం తెలంగాణ అని ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే గొడవలు జరుగుతాయన్న వారే.. ఇవాళ తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకపోతున్నారని చెప్పారు. కరీంనగర్‌లో పేద ముస్లిం మహిళలకు కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ తుల ఉమ, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ రావు, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ అక్బర్ పాల్గొన్నారు. పేద ముస్లిం కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎంపీ వినోద్ తెలిపారు.