కరీంనగర్‌ జిల్లా జైలుకు తెదేపా ఎమ్మెల్యేలు

కరీంనగర్‌: విద్యుత్‌ ఎన్‌ఈ కార్యాలయం వద్ద ధర్నా చేసి ఫర్నిచర్‌ ధ్వంసం చేశారనే కేసులో తెదేపా ఇద్దరు ఎమ్మెల్యేలు.. పెద్దపల్లి ఎమ్మెల్యే, జిల్లా తెదేపా అధ్యక్షుడు విజయరమణారావు, చొప్పదండి ఎమ్మెల్యే సుద్దాల దేవయ్యలను అరెస్టు చేసిన పోలీసులు ఈరోజు కరీంనగర్‌ మేజిస్ట్రేటు ముందు హాజరు పరిచారు. ఆయన వారికి ఈ నెల 22 వరకు రిమాండ్‌ విధించారు. అనంతరం ఎమ్మెల్యేలను కరీంనగర్‌ జిల్లా జైలుకు తరలించారు.