కరీమాబాద్  పాఠశాలలో సామూహిక అక్షరాభ్యాసం

వరంగల్ ఈస్ట్, జూన్ 20(జనం సాక్షి):
  వరంగల్ నగరంలోని ని కరీమాబాద్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో సోమవారం   సామూహిక అక్షరాభ్యాస కార్య క్రమాన్ని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోనికేన శ్రీకాంత్ అధ్యక్షతన ఘనంగా నిర్వహించడం గా జరిగింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మరుపల్లి రవి  మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడానికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నది. ఉచిత పుస్తకాలు,మధ్యాన భోజనం, ఉచిత ఏక రూప దుస్తులు అందిస్తున్నది.ప్రభుత్వ పాఠశాలలో అనుభవజ్ఞులై ఉపాధ్యాయులు ఉన్నారు అన్నారు.  ఈ కార్యక్రమంలో పాఠశాల యాజమాన్యకమిటీ అధ్యక్షులు శ్రీమతి పరీనా బేగం  మాట్లాడుతూ విద్యార్థులు గణనీయంగా నమోదు అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులను కోరారు. ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు విజయ్ కుమార్  మాట్లాడుతూ కరీమాబాద్ పాఠశాల లో అందిస్తున్న నాణ్యమైన బోధన పట్ల విద్యార్థులకు మరియు తల్లిదండ్రులకు నమ్మకం ఏర్పడి విపరీతంగా చేరుతున్నారు అని సంతోషం వ్యక్తం చేసారు.ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు దోనికేన శ్రీకాంత్ మాట్లాడుతూ ఈ విజయానికి కారకులు ఉపాధ్యాయ బృందం మాత్రమే అని వారికీ కృతజ్ఞతలు తెలియజేశారు. ఇది జట్టు స్ఫూర్తికి నిదర్శనం అని అన్నారు. ఈ కార్యక్రమంలో  దుర్గం రవి, ఉపాద్యాయ బృందం రేఖ, వీరాచారి,రఘు,వెంకటేశ్వర్లు, శ్రీనివాస్, చక్రపాణి,అశోకు సీఆర్పీ రహమాను, పాల్గొననున్నారు