కరీమాబాద్ లో వైభవంగా పోచమ్మ బోనాలు
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 24(జనం సాక్షి)
వరంగల్ నగరంలోని అండర్ రైల్వే గేట్ కరీమాబాద్ ప్రాంతంలో బుధవారం పోచమ్మ బోనాల పండుగ వైభవంగా నిర్వహించారు. శ్రావణమాసం ఆఖరి బుధవారం కావడంతో భక్తులు పెద్ద ఎత్తున డప్పు చప్పుళ్ళ నడుమ బోనాలతో స్థానిక పోచమ్మ దేవాలయానికి వచ్చి తమ మొక్కులు సమర్పించారు. పోచమ్మ తల్లి మా పిల్లాపాపలతో చల్లగా చూడు అంటూ వేడుకున్నారు. ఈ సందర్భంగా వందలాదిగా వచ్చిన భక్తులకు దేవాలయ నిర్వాహకులు అన్ని రకాల ఏర్పాటు చేశారు. అలాగే ఉరుసు, రంగశాయిపేట, శివనగర్, కిలా వరంగల్, కొత్త వాడ, పోచమ్మ మైదాన్, లేబర్ కాలనీ, వరంగల్ చౌరస్తా, రామన్నపేట తదితర ప్రాంతాల్లోని పోచమ్మ దేవాలయాలకు వందలాదిగా భక్తులు వచ్చి తమ మొక్కులు సమర్పించారు