కరెంటు కష్టాలు ఉండొద్దు

` ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతస్థాయి సమీక్ష
` విద్యుత్‌ శాఖ బకాయిలు రూ.85 వేల కోట్లు
` సీఎం సమీక్షలో అధికారుల వెల్లడి
` పిలిచినా హాజరుకాని ప్రభాకర్‌ రావు
` తనను ఎవరూ పిలవలేదన్న సీఎండీ
హైదరాబాద్‌(జనంసాక్షి):వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా..ధనిక రాష్ట్రంలో విద్యుత్‌ శాఖ బకాయిలు 85 కోట్లు ఉన్నట్లు తేలింది. విద్యుత్‌ శాఖపై  ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  ప్రత్యేక సవిూక్షలో అధికారులు ఈ విషయం వెల్లడిరచారు. సచివాలయంలో జరుగిన సమావేశానికి సీఎండీ ప్రభాకర్‌ రావు  గైర్హాజరయ్యారు. ఈనెల 3న ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ పదవికి ప్రభాకర్‌ రావు రాజీనామా చేశారు. రాజీనామా చేసినా రివ్యూకు హాజరుకావాలని సీఎం రేవంత్‌ ఆదేశించారు. స్వయంగా సీఎం రేవంత్‌ ఆహ్వానించినప్పటికీ సీఎండీ ప్రభాకర్‌రావు సమావేశానికి హాజరుకాని పరిస్థితి ఏర్పడిరది.  విద్యుత్‌ శాఖ అంశంలో గురువారం సీఎం సీరియస్‌ అయిన విషయం తెలిసిందే. విద్యుత్‌ శాఖలో రూ.85 వేల కోట్ల నష్టం వచ్చిందని అధికారులు చెప్పారు. సీఎండీ ప్రభాకర రావును సవిూక్షకు రప్పించాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ శుక్రవరాం జరుగుతున్న విద్యుత్‌ శాఖ ప్రత్యేక సవిూక్షకు సీఎండీ ప్రభాకర్‌ రావు గైర్హాజరవడం చర్చనీయాంశంగా మారింది. అయితే విద్యుత్‌ శాఖపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సచివాలయంలో నిర్వహించిన సవిూక్ష సమావేశానికి హాజరు కావాలంటూ తనను ఎవరూ పిలవలేదని ట్రాన్స్‌ కో, జెన్కో సిఎండీ దేవులపల్లి ప్రభాకరరావు స్పష్టం చేశారు. తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. కరెంటు లెక్కల్లో అవకతవకలు జరిగాయనీ, అవి తేలేవరకూ సిఎండీ దేవులపల్లి రాజీనామాను ఆమోదించవద్దనీ ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా వార్తలు వచ్చాయి. అలాగే విద్యుత్‌ శాఖపై జరిగే సవిూక్షా సమావేశానికి ఆయనను పిలవాలని సిఏం అధికారులను ఆదేశించారని కూడా తెలిసింది. అయితే తనకు ఎలాంటి సమాచారం లేదని, ముఖ్యమంత్రి పిలిస్తే వెళ్లకుండా ఎందుకుంటానని దేవులపల్లి అన్నారు.