కలకోవలో సిపిఎం పార్టీ కార్యకర్తలపై టిఆర్ఎస్ పార్టీ దాడిని ఖండించండి
సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు
మునగాల, అక్టోబర్ 7(జనంసాక్షి): కలకోవ గ్రామంలో సిపిఎం కార్యకర్తల పైన టిఆర్ఎస్ పార్టీకి చెందిన వారు రాళ్లతో దాడి చేయటాన్ని ఖండించాలని, పోలీసు వారు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, అకారణంగా దాడి చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు కోరారు. ఈ సందర్భంగా శుక్రవారం మునగాల సిపిఎం పార్టీ అమరవీరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు బుర్రి శ్రీరాములు మాట్లాడుతూ, కలకోవ గ్రామంలో టిఆర్ఎస్ పార్టీ వాళ్ల ఆగడాలు అరాచకాలు రోజురోజుకీ మితిమీరి పోతున్నాయని, వీరి ఆగడాలను అరాచకాలను ప్రోత్సహిస్తున్న కోదాడ నియోజకవర్గ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ గత 4 సం.రాల నుండి దాదాపుగా 40 సార్లు సిపిఎం పార్టీ కార్యకర్తల పైన దాడి చేయడం, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధుడు, 2 సార్లు ఇనాన్ మాస్ సర్పంచ్ సురభి వీరయ్య స్తూపాన్ని కూల్చటం, పార్టీ గద్దెపైన టిఆర్ఎస్ గద్దె కట్టడం, దారికాచి పాత కోట్ల లింగయ్యను, బుర్రి నాగేశ్వరరావును, ముదిగొండ రామారావును, అనంతు కోటి లింగంను, మండవ వెంకన్నను, మండవ లింగయ్యలపై దాడులు చేసినారని తెలిపారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ రోజున కార్యక్రమమును 2 వేల మందితో నిర్వయించగా దీనిని జీర్ణించుకోలేని టిఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షులు అనంతు శ్రీను నాయకత్వాన అతను, అతని అనుచరులు సిద్ధుల శ్రీను, పనస శ్రీను, కొంపెల్లి శ్రీను, 6వ తారీకు గురువారం సాయంత్రం 7గం.ల సమయంలో సిపిఎం కార్యకర్తలపైన రాళ్ల దాడి చేసినారని పేర్కొన్నారు. ఎంఎల్ఏ బొల్లం మల్లయ్య యాదవ్ వీరిని నిలువరించకపోగా, వీళ్ళని గతంలో ప్రోత్సహిస్తూ కలకోవ గ్రామానికి వచ్చారని, మునగాల మండలంలో కలకకోవే కాదు.. కోదాడ నియోజకవర్గంలో ఇలాంటి ఆరాచక శక్తులను ప్రోత్సహించడం నియోజకవర్గ ప్రజలు కూడా గమనిస్తున్నారని, గత 4సం.రాల నుండి ఇలాంటి అవకాశవాద రాజకీయాలను ఎమ్మెల్యేలను చూడలేదని అన్నారు. సిపిఎం పార్టీ నాయకత్వన నియోజకవర్గ వ్యాప్తంగా అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకువెళతామని, ఎమ్మెల్యే తప్పుడు విధానాలను నియోజకవర్గ ప్రజలు, ప్రజాతంత్ర వాదులు, అఖిలపక్షల పార్టీలు, ఖండించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శివర్గ సభ్యుడు బచ్చలకూర స్వరాజ్యం, దేశిరెడ్డి స్టాలిన్ రెడ్డి, కమిటీ సభ్యులు మండవ వెంకటాద్రి, అనంతు గురువయ్య, మండవ వెంకన్న, ధర్మయ్య, వెంకన్న, రంగయ్య, సత్యం, కోటయ్య, కోటిలింగం, వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు.