కల్లుగీత కార్మిక సంఘ మండల మహాసభలను జయప్రదం చేయండి
కేజీకేస్ మండల అధ్యక్షుడు మేకపోతుల అంజయ్య
డోర్నకల్ సెప్టెంబర్ 14 జనం సాక్షి
మండలంలోని గొల్లచర్ల గ్రామంలోని విజయ గార్డెన్ లో నేడు జరిగే తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం మండల మహాసభను విజయవంతం చేయాలని మండల కల్లుగీత కార్మిక సంఘం మండలాధ్యక్షుడు మేకపోతుల అంజయ్య ఓ ప్రకటనలో కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘంకు ప్రభుత్వం నుంచి వృత్తి పింఛన్,ఎక్స్ గ్రేషియా పెంపు,సభ్యత్వం గుర్తింపు కార్డులు, వృత్తిపని రద్దు,నీరా పాలసీ,సర్దార్ సర్వాయి పాపన్న జయంతి అధికారికంగా నిర్వహించాలని తదితర 20 డిమాండ్లు సాధనకు సభలను నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బహుళజాతి కంపెనీల లిక్కర్, శీతల పానియాల ఉత్పత్తుల దాటికి తట్టుకోలేక కల్లు అమ్మకాలు పడిపోయి ఫలితంగా వృత్తిలో ఉపాధి దొరకగా బ్రతుకు తెరువు కోసం ఇతర పనులు వెతుక్కుంటూ పట్టణాలకు వలస బాట పడుతున్నారని, మరొ ప్రక్క వృత్తిలో ప్రమాదాలు జరిగి వేలాదిమంది వికలాంగులు అయి చనిపోతున్నారని అన్నారు.మండల వ్యాప్తంగా ఉన్న గౌడ,గీత కార్మికులందరిని పార్టీలకతీతంగా సమీకరించేందుకు సంఘం కృషి చేస్తుందని దీనిలో మీరు భాగస్వాములై మండల మహాసభను జయప్రదం చేయాలని ఆయన అన్నారు. ఈ సభకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యమ్ వి రమణ,ఐలి వెంకన్న గౌడ్ రాష్ట్ర కన్వీనర్,గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ,కల్లుగీత కార్మిక సంఘం మహబూబాబాద్ జిల్లా అధ్యక్షులు యమగాని వెంకన్న, కల్లెపు సతీష్ కుమార్ గౌడ్ అఖిలభారత గౌడ సంఘం మానుకోట జిల్లా అధ్యక్షులు,పోడిశెట్టి కమల రామనాథం జడ్పిటిసి డోర్నకల్, మేకపోతుల రమ్య శ్రీనివాస్ గౌడ్ మాజీ ఎంపీపీ,బోయినపల్లి వెంకన్న సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు,గంధంసిరి ఉపేందర్ మాజీ సర్పంచ్ హాజరవుతున్నారని ఆయన తెలిపారు.