కళ్యాణలక్ష్మి దరఖాస్తులు పరిష్కరించండి

 

జగిత్యాల,జూన్‌2(జ‌నం సాక్షి): కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ దరఖాస్తుల విచారణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ ఆదేశించారు. ఓటర్ల నమోదు దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలన్నారు.జిల్లాలో పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ వందశాతం పూర్తి కావాలని ఆదేశించారు. ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాల మేరకు సవరణలు పూర్తి చేసి వెంటనే యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలన్నారు. పొరపాట్లను మొదట దస్త్రాల్లో సరిచేసి క్షేత్రపరిశీలన అనంతరం ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. సవరణల జాబితాలను ఈనెల 8లోగా సిద్ధం చేయాలని సవరించిన పాసుపుస్తకాల ముద్రణ మండలస్థాయిలో 10వ తేదీలోగా జరగాలని ఆలోపు సమస్యలన్నింటిని గుర్తించాలన్నారు. పొరపాట్ల లేని గ్రామాలను ప్రత్యేక అధికారులు ఈనెల 10లోగా ప్రకటించి రెండురోజుల్లో కొత్త పాసుపుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పంపిణీ కాని పాసుపుస్తకాలు, చెక్కులపై కారణాలతో నివేదిక సిద్ధం చేయాలన్నారు.