కళ్యాణ లక్ష్మి పథకం.. పేదలకు వరం
వేమనపల్లి,అక్టోబర్ 22, (జనంసాక్షి):
వేమనపల్లి మండలంలోని కేతనపల్లి,ముల్కలపేట, గొర్లపల్లి,వేమనపల్లి,నాగారం,జిల్లెడ,సూరారం,జక్కెపల్లి గ్రామాలకు చెందిన 18 మంది లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎంపీపీ ఆత్రం గణపతి,జెడ్పిటిసి రుద్రభట్ల స్వర్ణలత-సంతోష్ కుమార్,నీల్వాయి ఎంపీటీసీ రుద్రభట్ల సంతోష్ కుమార్,తహసీల్దార్ రాజ్ కుమార్, స్థానిక సర్పంచ్ కుబిడే మధుకర్ లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఈ పథకం పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని అన్నారు.చెక్కులు అందుకున్న లబ్ధిదారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.