కవి సమ్మేళనంలో కవులకు ఘన సన్మానం.

నెరడిగొండఆగస్టు17(జనంసాక్షి):75వ స్వాతంత్ర వజ్రోత్సవ వేడుకలునిర్వహించుకుంటున్నసందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని జడ్పీ హాల్ యందు 75 మంది కవుల కవిత ఆలాపన జరిగింది.ఈ కార్యక్రమంలో నేరడిగొండ మండలం నుంచి కుమారి గ్రామానికి చెందిన కవి గడ్డం భీమ్ రెడ్డినికి మండల కేంద్రానికి చెందిన ప్రముఖ దళిత కవి జి ఆర్ కుర్మె లను కవితా పఠన అవకాశం దక్కింది.అనంతరం జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆధ్వర్యంలో కవులకు సన్మాన కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా భీమ్ రెడ్డిని సన్మానించారు.మండలం నుంచి కవితా పఠనం చేసి పేరు నిలిపి నందుకు పలువురు ప్రశంసలు తెలియపరిచారు.