కాంగ్రెస్‌ నాయకులది మూర్ఖత్వం

– ఆగస్టు చివరివారంలో కాళేశ్వరం మొదటి పంప్‌ ప్రారంభిస్తాం
– భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు
పెద్దపల్లి, జులై13(జ‌నం సాక్షి) : కాంగ్రెస్‌ నాయకులు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారని రాష్ట్ర భారీ సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. శుక్రవారం ఉదయం కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఆరో ప్యాకేజీ పనులను  పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు మాట్లాడుతూ.. తమ్మిడిహట్టి వద్ద బ్యారేజీ నిర్మించాలని డిమాండ్‌ చేయడం కాంగ్రెస్‌ నాయకుల మూర్ఖత్వమన్నారు. తమ్మిడిహట్టి వద్ద నీటి లభ్యత లేదని కేంద్ర జలసంఘం స్పష్టం చేసిన విషయాన్ని మంత్రి గుర్తు చేశారు. ప్రాణహిత – చేవెళ్ల పనులు ప్రారంభించి 8 ఏళ్లెనా ఒక్క అనుమతి తేలేదని నిప్పులు చెరిగారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నాలుగేళ్లలో అన్ని అనుమతులతో పనులను తుదిదశకు తెచ్చిందని మంత్రి తెలిపారు. ఆగస్టు చివరి వారంలో కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మొదటి పంప్‌ ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. 8వ ప్యాకేజీలో 139 మెగావాట్ల పంప్‌సెట్‌ డ్రైరన్‌ నిర్వహిస్తున్నామని హరీశ్‌రావు తెలిపారు. జీ 8 నుంచి కాలువ వరకు బయలుదేరే గ్రావిటీ కాలువను సందర్శించారు. వర్షాల వల్ల లైనింగ్‌ పనులు ఆగినయని ఇంజనీర్లు చెప్పారు. కాలువలో నీటిని తోడి పనులు చేస్తున్నామని తెలిపారు. కాలువపై స్టక్చర్ల్రు ఈ నెలాఖరు కు       స్టక్చ్రర్లు   అ/-రవుతాయని అన్నారు. గ్రావిటీ కాలువ వరద కాలువలో కలిసే ముందు ఉన్న రెగ్యులేటర్‌ పనులను పరిశీలించారు. ఇక్కడ గేట్ల బిగింపు పనులు ఆగస్టులో పూర్తి చేస్తామని అధికారులు మంత్రికి వివరించారు. పనులు మరింత వేగవంతం చేయాలని హరీశ్‌ రావు ఆదేశించారు.
5.70 కిలోవిూటర్ల పొడవైన గ్రావిటీ కాలువ మట్టి పని మొత్తం అయ్యింది. లైనింగ్‌ లో 1.4 కిలోవిూటర్లు మిగిలి ఉంది. 10 స్టక్చర్స్ర్‌ లో 5 పూర్తయ్యాయి. మిగిలిన 5 ఈ నెలాఖరుకు పూర్తవుతాయని ఏజెన్సీ ప్రతినిధులు మంత్రి హరీశ్‌ రావుకు వివరించారు. శ్రీరాంసాగర్‌ కు వరద వస్తే వరద కాలువలో నీరు వదిలే అవకాశం ఉందని, రెగ్యులేటర్‌ గేట్లు, రెగ్యులేటర్‌ వరకు లైనింగ్‌ పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఆదేశించారు.