*కాంగ్రెస్ నాయకుల ముందస్తు అరెస్ట్*

పెద్దేముల్ ఆగస్టు 16 (జనం సాక్షి)
ముఖ్యమంత్రి కెసిఆర్ జిల్లాకు వస్తున్న సంధర్బంగా ముందస్తుగా పెద్దేముల్ మండల కాంగ్రెస్ పార్టీ నాయకులను పోలిసులు అరెస్టు చేశారు.
వికారాబాద్ జిల్లాలో మంగళవారం సీఎం కెసిఆర్ పర్యటన సందర్భంగా పెద్దేముల్ పోలిసులు ముందస్తుగా ఏలాంటి అవాచనీయ సంఘటనలు జరగకుండా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గోపాల్, తట్టేపల్లి ఎంపీటీసీ శంకర్ నాయక్,నర్సింలు లను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సంధర్బంగా మండల అధ్యక్షుడు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ నాయకులను,కార్యకర్తలను ముందస్తుగా అరెస్టు చేయడం తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం పోలీసులను అడ్డుపెట్టుకొని అరెస్టులు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పెద్దేముల్ మండల సమస్యలు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్దామనుకుంటే ముందస్తుగా అరెస్టు చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తంచేశారు.