కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 2లక్షల రుణమాఫి చేస్తాం.
రైతుల పాలిట శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేస్తాం.
తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి
ఆజాదీకా గౌరవ్ యాత్ర 75కిలోమీటర్లు పూర్తి చేసిన సీతక్క
ములుగు జిల్లా
గోవిందరావుపేట ఆగస్టు 14 (జనం సాక్షి):-
ఆదివారం గడిచిన 8యేండ్ల బిజెపి టీఆర్ఎస్ పాలన లో పేద ప్రజలకు ఒరిగింది ఏమి లేదు
అంబానీ ఆదాని ల ప్రభుత్వం మోడీ ప్రభుత్వం
కాంగ్రెస్ పార్టీ జాతీయ మహిళా ప్రధాన కార్యదర్శి ములుగు ఎమ్మెల్యే సీతక్క
ఈ రోజు గోవిందా రావు పేట మండలం లో ఎఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు గత 5రోజులుగా సీతక్క చేస్తున్న పాదయాత్ర ములుగు గట్టమ్మ నుండి పసర గ్రామం వరకు 75కిలోమీటర్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ముగింపు సభ కార్యక్రమములో ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజలు
ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్య్రం తెచ్చిన గాంధీని చంపిన గాడ్సెను ఈరోజు బీజేపీ స్వాతంత్య్ర యోధుడిగా పరిగణిస్తోంది ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికివదిలేసిన టీఆర్ఎస్ పార్టీ తెలంగాణను దోచుకోవడమే పనిగా పెట్టుకుందితెలంగాణను దోచుకుంటున్న టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఇష్టారాజ్యంగా నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది బీజేపీ పాలనతో దేశం ప్రతిష్ట రోజురోజుకూ దిగజారిపోతోంది వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ బీజేపీలకు ప్రజలు బుద్ధి చెప్పి గద్దె దించాలి కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఎస్స్టీలకు న్యాయం జరిగింది.సబ్‌ప్లాన్ తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదేఅన్నివర్గాల ప్రజల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేసిందికాంగ్రెస్ పార్టీ హయాంలోనే నిరుపేదలకు మిగులు భూములు పంచిన విషయాన్ని మనందరం గుర్తుంచుకోవాలి
ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు తొమ్మిది రకాల సరుకులను ఇచ్చింది.కానీ నేడు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్నింటిలో కోతలు పెడుతూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తోందికేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డీజిల్,పెట్రోల్ ధరలు నియంత్రణలో ఉన్నాయి కానీ బీజేపీ టీఆర్ఎస్ పాలనలో ధరలు విపరీతంగా పెరుగున్నాయి. ఆనాడు కేవలం రూ.300కే వంట గ్యాస్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది
కాంగ్రెస్ పార్టీ హయాంలో రైతులకు డీఏపీ లాంటి ఎరువు కేవలం బస్తాకు రూ.850కే లభించింది. కానీ బీజేపీ పాలనలో ఈ రోజు రూ.1700కు చేరుకుంది.కాంగ్రెస్ పార్టీ హయాంలో ఇంట్లో ఎంతమంది అర్హులుంటే అంతమందికి పింఛన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది టీఆర్ఎస్ పార్టీ పాలనలో ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇస్తున్నారు. అదికూడా నెలనెలా ఇవ్వడం లేదు దళితులకు మూడెకరాల భూమి,డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం దారుణంగా విఫలం చెందింది ఇప్పటికైనా ప్రజలు మేల్కొని కాంగ్రెస్ పార్టీని ఆదరించి అధికారంలోకి తీసుకురావాలి సీతక్క గారు ప్రజలను ఉద్దేశించి అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు నల్లెల కుమారస్వామి టిపిసిసి అధికార ప్రతినిధి రవళి రెడ్డి టీపీసీసీ కార్యదర్శి
పైడాకుల అశోక్ల్ నారాయణ రెడ్డి
కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు గొల్ల పెల్లి రాజేందర్ గౌడ్మా జీ మార్కెట్ కమిటీ చైర్మన్ మల్లాడి రాం రెడ్డి,ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య,ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు దాసరి సుధాకర్,మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎండీ అయుబ్ ఖాన్,ఫిషర్ మెన్ జిల్లా అధ్యక్షులు కంబాల రవి మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కొమురం ధన లక్ష్మి,జెడ్పీటీసీ నామా కరం చంద్ గాంధీ,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు బై రెడ్డి బాగ్ వాన్ రెడ్డి, ఇరుస వడ్ల వెంకన్న మండల అధ్యక్షులు చెన్నోజు సూర్య నారాయణ,ఎండీ అఫ్సర్ పాషా,చిట మాట రఘు మైల జయరాం రెడ్డి,చిట మాట రఘు,జాలాపూ అనంత రెడ్డి,వర్కింగ్ కమిటీ అధ్యక్షులు బండి శ్రీనివాస్, రసుపుత్ సీతారాం నాయక్, తో ఛాల్వయి,గోవిందా రావు పేట దుంపిళ్ల గూడెం గ్రామ కమిటీ అధ్యక్షులు సీనియర్ నాయకులు కాంగ్రెస్ పార్టీజిల్లా
మండల,గ్రామ,అనుబంధ సంఘాల అధ్యక్షులు జిల్లా సీనియర్ నాయకులు సర్పంచ్, ఎంపీటీసీ,సహకార సంఘం చైర్మన్ లు తదితరులు పాల్గొన్నారు.