కాంటిజెంట్ వర్కర్ల వేతనాలను విడుదల చేయాలి

ఎఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగుల్ మీరా

జూలూరుపాడు, ఆగష్టు 19, జనంసాక్షి: మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న కాంటిజంట్ వర్కర్ల వేతనాలను వెంటనే విడుదల చేయాలని ఏఐవైఎఫ్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ నాగుల్ మీరా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఆసుపత్రిని సందర్శించి వర్కర్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న కాంటిజెంట్ వర్కర్ల వేతనాలు గత ఏడాది నుంచి పెండింగ్ లో ఉండటంతో పేద కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయని అన్నారు. వర్కర్లకు నెల వేతనం కేవలం 3వేల రూపాయిలు మాత్రమే ఇస్తుండటంతో చాలీచాలని జీతంతో అవస్థలు పడుతున్నారని అన్నారు. మార్కెట్లో నిత్యవసర వస్తువుల ధరలు పెరగడాన్ని దృ‌ష్టిలో పెట్టుకుని కనీస వేతనం 9వేల రూపాయలు ఇవ్వాలని, వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్ష, కార్యదర్శులు పగడాల అఖిల్, షేక్ చాంద్ పాషా, సైదులు, కన్నీ, రాధాకృష్ణ, అశోక్, కంటింజెంట్ వర్కర్లు ఏసుమనణి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు.