కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లకు జోహార్లు
పినపాక నియోజకవర్గం ఆగస్టు 22 (జనం సాక్షి):సి పీ ఐ రాష్ట్ర నేత సిద్ది వెంకటేశ్వర్లు మరణం పార్టీకి తీరని లోటని సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు బి అయోధ్య చారి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు ఆదర్శమూర్తిగా ,నిస్వార్థ నాయకుడుగా పార్టీకి పేద ప్రజలకు ఎనలేని కృషి చేసిన ఆయన లేకపోవడం చాలా బాధాకరం. విద్యార్థి ఉద్యమం నుంచి యువజన సంఘంలో, పార్టీలో అనేక సంవత్సరాలుగా పని చేస్తూ నిస్వార్థ జీవితం గడుపుతూ నమ్మిన సిద్ధాంతం కోసం, విలువల కోసం , పార్టీలో కష్టపడి పని చేస్తూ అంచలంచలుగా ఎదిగి పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శిగా పనిచేసినటువంటి కామ్రేడ్ సిద్ధి వెంకటేశ్వర్లు లేరనే విషయం మనసుకు చాలా బాధాకరమని అన్నారు. ఆయనతో కలిసి పని చేయడం ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఖమ్మం జిల్లా కార్యదర్శిగా పనిచేసిన సిద్ధి వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యమానికి పోరాటాలకు శ్రీకారం చుట్టారని తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తమ వంతు బాధ్యతలను నిర్వర్తించారు. పార్టీ తరఫున ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించారు. ఆయన నమ్ముకున్న సిద్ధాంతం కోసం పార్టీలో పని చేసి ఎంతో మంది కి ఆదర్శంగా నిలిచారు. వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. సిపిఐ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు బి అయోధ్య గారు తెలిపారు. కామ్రేడ్ సిద్ది వెంకటేశ్వర్లు మరణం పట్ల సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు స రెడ్డి పుల్లారెడ్డి, మున్నా లక్ష్మీకుమారి ,మండల పట్టణ కమిటీకార్యదర్శులు దుర్గ్యాల సుధాకర్, జంగ మోహన్ రావు, జిల్లా సమితి సభ్యులు ఆర్ లక్ష్మీనారాయణ, అక్కి నరసింహారావు ఎస్ కే సర్వర్ వై రామ్ గోపాల్ లు విప్లవ జోహార్లు తెలియజేస్తూ సంతాపాన్ని సానుభూతిని వ్యక్తం చేశారు.