కార్యకర్తలకు అండగా ఉంటా.

బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య.
ఫోటో రైటప్: నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే.
బెల్లంపల్లి, ఆగస్టు14, (జనంసాక్షి)
కార్యకర్తల కుటుంబాలకు అండగా ఉంటానని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అన్నారు. ఆదివారం ఆయన నెన్నెల మండలం మెట్ పల్లి గ్రామంలో మాజీ ఉప సర్పంచ్ బోర్లకుంట రాజమౌళి తండ్రి చనిపోయిన విషయం తెలుసుకొని పెద్దకర్మ కార్యక్రమానికి హాజరై వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈసందర్భంగా ఆయన కార్యకర్తలతో ముచ్చటిస్తు పార్టీ కార్యకర్తలకు ఎలాంటి ఆపద వచ్చిన తనకు సంప్రదిస్తే అండగా ఉంటానని పిలుపునిచ్చారు. ఆయన వెంట నాయకులు గడ్డం భీమా గౌడ్, సింగతి రాం చందర్, సున్నం రాజు కార్యకర్తలు ఉన్నారు.