కాళేశ్వరంతో సకల దరిద్రాలు పోతాయి: నారాదాసు

కరీంనగర్‌,జ‌నం సాక్షి ): తెలంగాణ అంటేనే ఒక గొప్ప చరిత్ర.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయ్యాక రాష్టాన్రికి మరో చరిత్ర సృష్టించబోతున్నది ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌ రావు అన్నారు. రాష్ట్రంలో ఒక అద్భుతం జరగబోతుందని, రాష్ట్ర ప్రజలను ఉన్నతస్థాయిలో నిలబెట్టాలన్న కేసీఆర్‌ ఆకాంక్షకు ప్రతిరూపంగా ప్రాజెక్‌ంటు నిర్మాణం సాగుతోందని అన్నారు.ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుతోనే 70 ఏళ్లు దరిద్రం వదలబోతోందని అన్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ఉత్తర తెలంగాణలో 37 లక్షల ఎకరాలకు సాగునీరు నిరంతరం అందుతుందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ కడుతుంటే కాంగ్రెస్‌ వాళ్లు అప్పులు చేసి కట్టడం కూడా గొప్పేనా అంటూ హేళన చేయడం విడ్డూరంగా ఉందన్నారు.భవిష్యత్‌ తరాలు సీఎం కేసీఆర్‌ను అపర భగీరథుడిగా చెప్పుకుంటాయని అన్నారు. అన్నారం, మేడిగడ్డ, కన్నెపల్లి, సుందిళ్ల ఈ మారుమూల గ్రామాలు నిన్నటి వరకు బాహ్య ప్రపంచానికి తెలియదని, ఈరోజు ఆ పల్లెల గురించి ప్రపంచం చెప్పుకుంటుందంటే ఆ గొప్పతనమంతా కేసీఆర్‌దే అన్నారు. 70 ఏళ్లుగా ఈ ప్రాంతాల విూదుగా గోదావరి జలాలు వృథాగా వెళ్లి సముద్ర గర్భంలో కలుస్తుంటే చూసుకుంటూ కూర్చున్న కాంగ్రెసోళ్లు ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కడితే.. విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే మత్స్యకారులు ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతారని, ఇప్పుడు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి ప్రాంతాలు ఎలా ఉన్నాయో అంతకంటే ఎక్కువ రెట్టింపు కాళేశ్వరంతో రూపురేఖలు మారుతాయన్నారు. ప్రాజెక్టులు పూర్తయ్యాక

ఎక్కడికక్కడ మత్స్యకారులు చేపలు పట్టుకొని విక్రయించుకునేందుకు ఫిష్‌ మార్కెట్‌లను ఏర్పాటు

చేస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే మత్స్యకారులకు ప్రభుత్వం సబ్సిడీ కింద మోటార్‌ బైక్‌లను కూడా అందజేస్తుందన్నారు. రాష్ట్రంలోని అన్ని కుల వృత్తులకూ ఆర్థిక వనరులను సమకూర్చాలన్నదే కేసీఆర్‌ లక్ష్యమన్నారు. అందులో భాగంగానే రూ. 5 వేల కోట్లతో రాష్ట్ర వ్యాప్తంగా సబ్సిడీ గొర్రెలను పంపిణీ చేశారన్నారు. ఎండాకాలంలో గొర్రెలు వాతావరణాన్ని తట్టుకునేలా ఈ దాణా పంపిణీ చేస్తున్నామని, ఒక్కో బస్తా రూ.3వేల దాకా ఉంటుందని చెప్పారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పనిస్తోందని అన్నారు. బాధితులకు అండగా కార్యకర్తలు నిలబడాలని సూచించారు. ఆపదలో ఉన్న వారిని ఆదుకున్న ప్పుడే గుర్తింపు లభిస్తుందన్నారు.