కాళేశ్వరం వద్ద పర్యాటకుల సందడి

పెద్దపల్లి,జూలై20(జ‌నం సాక్షి): కాళేశ్వరం గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. తెలంగాణలో కురుస్తున్న వర్షానికి తోడు మహారాష్ట్రలో భారీ వర్షాలు పడడంతోగోదావరి నిండు కుండలా ప్రవహిస్తోంది. దీంతో ఇక్కడికి వచ్చే పర్యాటకులు గోదావరి అందాలను తిలకిస్తున్నారు. గోదావరి వంతెనకు సవిూపంగా ప్రవహిస్తుండటంతో అటు మహారాష్ట్ర, ఇటు తెలంగాణలోని సవిూప ప్రజలు వంతెన వద్దకు చేరుకుని గోదావరి అందాలను వీక్షిస్తున్నారు. మరోవైపు ప్రాణహిత నది నుంచి వరదనీరు గోదావరికి చేరుతుండటంతో కాళేశ్వరం వద్ద క్రమంగా నీటిమట్టం పెరుగుతూ ఘాట్‌ వరకు చేరుకుంది. మరో రెండురోజుల్లో నీటి ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు.