కిలా వరంగల్ ఎమ్మార్వో ఆఫీస్ ముందు వీఆర్ఏ ల సమ్మె
వరంగల్ ఈస్ట్, ఆగస్టు 19(జనం సాక్షి)
ముఖ్యమంత్రి నిండు అసెంబ్లీ లో తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకులకి వీఆర్ఏ లకు ప్రకటించిన పే స్కేల్, 55 సం. నిండిన వీఆర్ఏ వారసులకు ఉద్యోగాలు, అర్హత కలిగిన వి ఆర్ ఏ లకు ప్రమోషన్ కల్పించాలి అని రాష్ట్ర వి ఆర్ ఏ ఐజాక్ ఇచ్చిన పిలుపు మేరకు నిరవధిక సమ్మె నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో భాగంగా ఖిలా వరంగల్ మండలంలోని వీఆర్ఏల మండల అధ్యక్షులు అన్నం సదానందం అధ్యక్షతన 26వ రోజు సమ్మెలో తమ యొక్క ప్రధానమైన డిమాండ్స్ తక్షణం పరిష్కరించి న్యాయం చేయాలని కోరినారు. ఈ కార్యక్రమం లో వరంగల్ జిల్లా వీఆర్ఏ జాక్ కో -కన్వీనర్ మండల గౌరవ అధ్యక్షులు గుండాల వెంకటేశ్వర్లు, మండల ఉపాధ్యక్షులు ఆరూరి క్రిష్ణకాంత్, కార్యదర్శి మేకల యాదగిరి, కోశాధికారి చిట్ల విశ్వేశ్వర్ మరియు వీఆర్ఏలు లు సూర్య, విద్యా సాగర్, రాజు,ఎకాంబ్రం,రమేష్, ప్రమీల, దర్శనం, గణేష్, ఆసిఫ్, రాములు, సారయ్య, కుమారస్వామి, శేకర్, భిక్షపతి, సూరయ్య తదితరులు పాల్గొన్నారు.