కురుస్తున్న వర్షాలు..! చిగురిస్తున్న ఆశలు…!
కరీంనగర్ జూలై 22 (జనంసాక్షి) : వానకాలం ప్రవేశించి నెలదాటిన వర్షాలు రాకపోవడంతో రైతులు ఆందోళన చెందారు. రెండు రోజులుగా నైరుతి రుతుపవనాల అల్పపీడన ద్రోణితో జిల్లా వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. వానలు పడడంతో రైతులు సాగుపై దృష్టి పెట్టారు. దుక్కులు దున్ని విత్తనాలు వేసి వర్షకోసం ఎదురుచూస్తున్న తరుణంలో పదిరోజులుగా దోబుచులాడింది. నిరాశ నిస్పృహలతో ఆందోళనచెందుతున్న రైతులకు కురుస్తున్న ఈ వానలు ఊరటనిస్తున్నాయి. ఇప్పటికే జిల్లాలో కురువవల్సిన వర్షాపాతంలో సగంకూడా లేదు. మధ్యలో నేలతడిసిందని ఆశతో వేసిన విత్తనాలు మొలకెత్తక పోవడంతో దిక్కుతోచని పరిస్థితులోవున్న రైతులను ఈ వానలు ఆదుకున్నాయి. దీంతో ఎరువులు విత్తనాలు పురుగుమందుల కొనుగోలుకు పెట్టుబడులు సమకుర్చుటకు సమయత్తం అవుతున్నారు. ఇది వరకే వేసిన పత్తి విత్తనాలు మొలకెత్తె దశలోవుండగా ఇంతవరకు విత్తనాలు చల్లని రైతులు విత్తనాలు వేసేందుకు ఏర్పాటు చేసుకుంటున్నారు. వర్షం సమృద్ధిగ కురుస్తేనే వరి నాట్లు వేయడానికి అనుకూలంగా ఉంటుంది. చెరువులు, కుంటలకు నీళ్లు రాకపోవడంతో వరిసాగుపై నీలినీడలలు ముకుం టున్నాయి. ఈ వర్షాలు ఇదేస్థాయిలో కురుసి చెరువుల్లోకి నీళ్లువచ్చి వరుద కాలువ ద్వారా ఎల్‌ఎండీలోకి నీరువస్తేనే వరిసాగు సాగుతుంది. ఇప్పటి వరకు ఎస్‌ఆర్‌ఎస్‌పీలో నీటి మట్టం ఏమాత్రం పెరగలేదు. ప్రధానం గా జిల్లాలోని వరిపండించే మండలాలు తిమ్మాపూర్, మానకొండురు, పెద్ద పల్లి, సుల్తానాబాద్, చొప్పదండి తదితర మండలాలలో వరి పంట అధికంగా సాగవుతుంది. ఇప్పటి వరకు నార్లుపోసి చెరువులు కుంటల్లో నీరు నిండి ఎస్‌ఆర్‌ఎస్‌పీ కాలువలద్వారా నీరు కోసం ఎదురుచూస్తున్నారు. ఆరుతడి పంటలు విషయంలో మాత్రం రైతుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. మొక్క జొన్న, మిర్చి, పత్తి, వేరిశనగ, కందితోపాటు కూరగాలయల సాగు టమాట, వంకాయ, పచ్చిమిర్చి, బీర, బెండలను విస్తారంగా సాగుచేసేందుకు జిల్లా వ్యాప్తంగా రైతులు ఏర్పాటు చేసుకుంటుంన్నారు. గత కొద్ది రోజులుగా వర్షా లు లేకపోవడంతో కూరగాయల సాగు లేక జిల్లా ప్రజలు అధిక ధరలకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ వర్షంతో కూరగాయలు పండించే రైతుల ఆశలు చిగురించి మరింత విస్తీర్ణంలో సాగు చేయడానికి ఏర్పాటు చేసుకుం టున్నారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలు జిల్లాలో ఇలాగే వుంటే కరువుఛాయల నుంచి బయటపడి పంటలు విస్తారంగా పండే అవకాశాలున్నాయని వ్యవసాయ అధికారులు పేర్కొటుంన్నారు.