కుల, మతాలకు అతీతం రక్షాబంధన్.
మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు.
తాండూరు అగస్టు 11(జనంసాక్షి)ముస్లిం సోదరులకు మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ పట్లోళ్ల దీప నర్సింలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.గురువారం తన నివాసంలో
రాఖీ పౌర్ణమి పురస్కరించుకుని టిఆర్ఎస్ యువ నాయకులు ఇర్షద్ ,ఇంతియాజ్ లకు
రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రేమ, కరుణ, సహన సీలతకు రాఖీలు నిదర్శనమన్నారు.
అన్నాచెల్లెల్లు, అక్కా తమ్ముళ్ల అనుబంధానికి ప్రతీకగా నిలిచే రక్షాబంధన్ కుల మతాలకు అతీమని అన్నారు. హిందూ సంప్రదాయం ప్రకారం రాఖీలు కట్టి స్వీట్లు తినిపించారు.
ఈసందర్భంగా పట్టణ ప్రజలకు రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలను తెలిపారు.