కుల వివక్షకు దూరంగా ఉండాలి
కామారెడ్డి,నవంబర్4 (జనంసాక్షి) : చట్టాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండాలని, దళితులపై కుల వివక్ష చూపరాదని తాడ్వాయి తహసీల్దార్ శ్రీనివాసరావు అన్నారు. సమాజంలో మానవులంతా ఒక్కటే అన్నారు.
గ్రామాల్లో రెండు గ్లాసుల పద్ధతి పాటించవద్దని తెలిపారు. ఎస్సీ,ఎస్టీ, మానవ హక్కులపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. కుల మత ద్వేషాలు పెట్టుకోవద్దని, శాంతియుత వాతావరణంలో జీవించాలన్నారు. ఎలాంటి సంఘటనలు జరిగినా పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఇదిలావుంటే ఉపాధిహావిూ పథకంలో పని చేసిన కూలీలకు డబ్బులను వెంటనే చెల్లించాలని అన్నారు.
గ్రామసభల్లో పనులను ఎంపిక చేసుకొని లేబర్‌బ్జడెట్‌ను తయారు చేసుకోవాలని ఉపాధిహావిూ సిబ్బందికి సూచించారు. మంజూరైన నిధులతో 75 రకాల పనులు చేపట్టనున్నట్లు చెప్పారు.