కూడంకుళం అణు విద్యుత్ ప్రమాదాలు
కూడంకుళంలో నిర్మాణమవుతున్న అణు విద్యుత్ ప్రాజె క్టు వల్ల ఆ చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు అనేక ప్రమాదాలు న్నాయి. స్థూలంగా ఈ ప్రమాదాలను రెండు రకాలుగా చూడవచ్చు. ఒకటి, ప్రభుత్వాలకు కనిపిస్తున్న ప్రమాదాలు, రెండు ప్రజలకు కనిపి స్తున్న ప్రమాదాలు. రెండూ వేరువేరు అనడం అంటే ప్రభుత్వాలు చట్టబద్ధమైనవి కాదని అనడం కాదు. ఎందుకంటే అవి ఓట్ల చేతనే ఎన్నుకోబడ్డాయి మరి! కానీ కనిపిస్తున్న వాటిని బట్టి ఈ ప్రభుత్వాలు ప్రజల కోసం మాత్రం పనిచేయట్లేదు అని చెప్పవలసి వస్తుంది . కూడంకుళం అణువిద్యుత్ ప్రాజెక్టు (కెేకేఎన్‌పీపీ) నిర్మాణాన్ని వ్యతిరే కిస్తూ వరుసగా ప్రతిఘటన తెలుపుతున్న ‘పీపుల్స్ మూవ్‌మెంట్ ఎగ నెస్ట్ న్యూక్లియర్ ఎనర్జీ’ (పీఎంఏఎస్‌ఈ) ఉద్యమకారులు ఎటువంటి ఆయుధాలు లేకుండా పూర్తి శాంతియుత పద్ధతులలో నిరసన తెలియజేస్తూ, కేవలం కూడంకుళం ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపడమే తమ ఉద్దేశ్యమని స్పష్టంగా ప్రకటిస్తున్నారు. ఆ ఉద్యమంలో సగం మంది మహిళలు, మొన్నటి ఎన్నికల్లో జయలలిత అత్యధిక మెజా రిటీతో గెలిపించిన వారు. వారిప్పుడు జయలలిత దృష్టిలో ఉన్నట్లు లేరు. వారి నుంచి అంతపెద్ద ప్రమాదం ఉంది కనుకనే ఆ ఉద్యమ నాయకులపైనే కాక అందులో పాల్గొంటున్న అనేక వేలమందిపై ‘రాజద్రోహం’, ‘రాజ్యానికి వ్యతిరేకంగా కుట్ర’ చేస్తున్నారనే ఆరోప డణలతో కేసులు నమోదు చేసింది. కొన్ని వందల మందిని జైళ్లలో నిర్బంధించింది.
భారీగా అవినీతి కుంభకోణాల్లో కూరుకుపోయిన, ఆదా యాలకు మించి అడ్డగోలు ఆస్తులు పోగేసుకున్న మంత్రులతో నిండి పోయిన ప్రభుత్వాలకు, ప్రజలు ఒక వాస్తవ సమస్య పట్ల న్యాయమైన ఆందోళన, శాంతియుత ప్రతిఘటన విపరీతంగా కనబడం అనేది అంత విచిత్రమేమి కాదు.ప్రభుత్వం ఇంకా ఆరోపిస్తోంది ఏమిటంటే ఈ కేకేఎన్‌పీపీ ప్రతిఘటనోద్యమానికి అంతర్జాతీయ విచ్ఛిన్నకర శక్తు ల నుంచి నిధులు అందుతున్నాయని. ఈ నిధులు ఏ సంస్థనుంచి ఎవరికి ఎంత మొత్తంలో అందాయనే దానికి ఒక్క ఆధారం చూప కుండానే ఒక పక్క ప్రభుత్వమే అణువిద్యుత్‌ను దేశంలో విస్తరిం చడానికి, పార్లమెంట్‌లో బిల్లు ఆమోదింపజేసుకోవడానికి పబ్లిక్‌గానే నిధులు అందుకోవడం మనం చూశాం.కూడంకుళం ప్రాజెక్టు నిర్మా ణం ఈ ప్రజా నిరసనల వల్ల ఇంకా ఆలస్యం అయితే, దాని ప్రభా వం వల్ల దేశంలో నిర్మాణమైన ఇతర అణు విద్యుత్ ప్రాజెక్టులకు రావలసిన నిధులు ఆగిపోతాయని, లేదా ఆ నిర్మాణాలు చేపట్టిన బహుళజాతి కంపెనీలకు నష్టాలు వస్తాయని, పెట్టుబడులు వెనుకకు పోతాయని ప్రభుత్వం భయపడుతోంది. అంటే ప్రభుత్వాలు వివిధ అంతర్జాతీయ వ్యాపార సంస్థలతో, పాలకులతో వివిధ ప్రాజెక్టుల కోసం ఈ దేశ వనరులను దోచిపెట్టడం కోసం కుదుర్చుకున్న రహ స్య ఒప్పందాలు, సంతకాలు చేసిన ఎంవోయూలు నిజంగానే ప్రమా దంలో పడతాయి మరి. ఇవన్నీ ప్రభుత్వాలకు ప్రమాదంగా కనబ డంలో ఆశ్చర్యమేమి లేదు. అయితే ప్రమాదాలను అధిగమించడం వల్ల ప్రజలకేమైనా మేలు జరుగుతుందా లేదా, ప్రజలకు మరిన్ని ప్ర మాదాలు వచ్చి పడతాయా అన్నది చూడవలసింది.
ప్రజలకున్న ఒకే ఒక్క జీవనాధారమైన భూమి, జీవిక కోల్పోవాల్సి రావడమే పెద్ద ప్రమాదం. కూడంకుళం ప్రాజెక్టు మొ దలు పెట్టడంతోనే ‘ఇడింతకరై’ ప్రాంత గ్రామాల ప్రజలు పరిహా రంతోనో, పరిహారం లేకుండానో తమ భూములను కోల్పోవాల్సి వచ్చింది. కోల్పోవడానికి భూమిలేని వాళ్లు జీవించడానికి అవస రమైన ఉపాధి కోల్పోయారు. ఇంకా ఈ ప్రాజెక్టు ప్రారంభమైతే మరి న్ని కోల్పోనున్నారు. ఈ ప్రాజెక్టు పనిచేస్తున్నప్పుడు రియాక్టర్లను చల్ల బరచడం కోసం సముద్ర జలాలను వాడుకొని వదిలి వేస్తుంటారు. ఫలితంగా ఆ ప్రాంత సముద్ర జలాలు, మత్స్య సంపద పూర్తిగా రేడ ియోధార్మిక పదార్థాలతో కలుషితమైతాయి. దీనివల్ల ఆ ప్రాంతంలో ఉన్న మత్స్యకారులంతా తమ వృత్తిని వదులుకొని పోవాల్సిందే. అంటే ఆ సమీప తీర ప్రాంతమంతటా నివసించే లక్షలాది మంది జీవనోపాధికి సంబంధించిన సమస్య కూడా.
కేకేఎన్‌పీపీ పనిచేస్తున్నప్పుడు విడుదలయ్యే రేడియో ధార్మిక ఉదా ్గరాలు, వ్యర్థాల వల్ల ఆ సమీప ప్రాంతపు గాలి, నీరు, నేల అంతా రేడియోధార్మికతమయమవుతాయి. ఇది ఆ ప్రాంత ప్రజల ఆరో గ్యంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ‘రావత్ భాటా’ అణు విద్యుత్ ప్లాంట్ ప్రాంత గ్రామాల్లో జరిపిన సర్వేలో అక్కడి ప్రజల్లో రేడియో ధార్మికత వల్ల వచ్చే తీవ్రమైన జబ్బులు, అంగవైకల్యంతో కూడిన శిశువుల జననం వంటివి ఎన్నో కేసులు ఉండడానికి కారణ మేమిటో అణువిద్యుత్ డిపార్ట్‌మెంట్‌వారుకానీ, అణువిద్యుత్ చాలా సురక్షితమైనదనే ప్రచారాన్ని చేస్తున్న మన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాంగారు కానీ వివరించరు.
‘రావత్ భాటా’లో వలెనే ఇక్కడ కూడా ప్రాజెక్టు ప్రా రంభించడానికి ముందు ప్రజల ఆరోగ్య స్థితిని గురించిన సర్వే, ఆ తర్వాత ప్రాజెక్టు వల్ల ప్రభావితం అవ్వడం వల్ల ప్రజల ఆరోగ్య స్థితిని పోల్చిచూడడం కోసం జరగనేలేదు. ఈ సర్వేలు జరపకపోవడం అనేది అటామిక్ ఎనర్జీ డిపార్ట్‌మెంట్ (డీఏఈ) వారు ఉద్దేశ పూర్వ కంగానో, నేరపూరితంగానో అని కూడా అనవచ్చు. అణువిద్యుత్ కార్మాగార ప్రాంత ప్రజల ఆరోగ్య సమస్యలైన క్యాన్సర్, అంగవైకల్యం, స్త్రీలలో గర్భస్రావం వంటి సమస్యలకూ ఆ ప్రాంత వాతావరణంలో ఉన్న రేడియో ధార్మికతకూ ఎలాంటి సంబంధం లేదనే మోసపూరితమైన వాదన చేస్తున్నారు.
ప్రాజెక్టు రక్షణ చర్యలకు సంబంధించి కూడా ప్రజల్లో అనేక భయాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నుంచి వెలువడే రేడియో ధార్మిక వ్యర్థాలను నిల్వచేయడంలో, శుద్ధి చేయడంలో తీసుకునే రక్షణ చర్యలు ఏమిటి? ఆ పరిసరాల్లో రేడియోధార్మికత స్థాయి అత్యంత కనిష్టస్థాయిలోనే ఉంచడానికి తీసుకునే చర్యలు ఏంటి? అనే దగ్గర నుంచి ఫుకుషిమా వంటి అనుకోని ప్రమాదాలు జరిగితే నష్టం జరగకుండా తీసుకునే రక్షణ చర్యలు ఏంటి. వాటి సమర్థత ఎంత? అనేదాకా అనేక భయాలు ప్రజల్లో ఉన్నాయి. ఈ రేడియో ధార్మిక ఉద్గారాలు, వ్యర్థాల నిర్వహణలో లోపాలు, వాటి నుంచి తలెత్తే సమస్యల గురించిన సమాచారాన్ని డీఏఈ ఉద్దేశపూ ర్వకంగానే తొక్కిపెడుతోంది.
(మిగతా భాగం రేపటి సంచికలో)
– ఎస్.జి. ఓమ్‌బట్కరే
(అనువాదం : జి. ఉదయ,
వీక్షణం సౌజన్యంతో…)