కూలిన పాఠశాల పైకప్పుఆరుగురు మృతి.. మరికొందరికి గాయాలు
లక్నో, జూలై 27 : ఉత్తరప్రదేశ్‌లో పాఠశాల పైకప్పు కూలిన దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని బిజనూరులోని ఒక పాఠశాల పై కప్పు శుక్రవారంనాడు కూలింది. ఈ దుర్ఘటనలో ఆరుగురు విద్యార్థులు మృతిచెందారు. మరికొందరికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దుర్ఘటన సమాచారం అందుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన పాఠశాల వద్దకు చేరుకున్నారు. తమ పిల్లలు తిరిగిరాని లోకాలకు వెళ్లడంతో వారు కన్నీరు మున్నీరయ్యారు. మరికొందరు పాఠశాల యాజమాన్యంపై మండిపడ్డారు. పాఠశాల వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.