కృష్ణ నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు గల్లంతు.

పాలక వీడు(జనంసాక్షి)న్యూస్. జాన్ పహాడ్ దర్గా సైదులు దర్శనానికి బంధువులతో కలిసి వచ్చి సమీపంలోని కృష్ణానదిలో స్నానలకు వెళ్లిన ఇద్దరు యువకులు గల్లంతైన ఘటన ఆదివారం మహంకాళి గూడెం పుష్కరఘాట్‌ వద్ద చోటు చేసుకున్నది.పాలక వీడు ఎస్సై సైదులు గౌడ్ తెలిపిన వివరాలు మేరకు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గుంటూరు జిల్లా ప్రాంతానికి తంగేడిగుంట గ్రామానికి చెందిన నాగుర్ (23) సుబాని,(27) జాన్ పహాడ్ దర్గా కు పుట్టు వెంట్రుకలు మహోత్సవానికి బంధువులతో కలిసి వచ్చి స్నానం చేయడానికి మహంకాళి గూడెం పుష్కర ఘాట్ వద్దకు వెళ్ళారు.స్నానం చేసే క్రమంలో ప్రమాదశాత్తు కృష్ణా నదిలో గల్లంతయ్యారు. ప్రవాహం ఎక్కువగా ఉన్న వైపు వెళ్లగా నీటిలో కొట్టుకుపోయాడు. సంఘటన స్థలాన్ని హుజూర్నగర్ సీఐ రామలింగారెడ్డి, తహశీల్దార్ శ్రీదేవి చేరుకొని గజ ఈతగాలతో గాలింపు చర్యలు చేపట్టారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్సై తెలిపారు.