కెసిఆర్ ప్రభుత్వం ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధితో పనిచేస్తుంది

ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరిసింగ్ నాయక్

టేకులపల్లి, సెప్టెంబర్ 15( జనం సాక్షి): తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం వైద్య ఆరోగ్య పై చిత్తశుద్ధితో పనిచేస్తుందని ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బానోతు హరి సింగ్ నాయక్ అన్నారు. గురువారం జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా టేకులపల్లి లోని కస్తూరబా గాంధీ బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ఆల్బెండజోల్ టాబ్లెట్లు విద్యార్థులకు ఆయన చేతుల మీదుగా వేశారు.ఈ సందర్భంగా ఉపాధ్యాయులను, విద్యార్థినులను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఒకప్పుడు పోలియో భారత దేశంలో విపరీతంగా ఉండేది అని కానీ ప్రభుత్వం నిరంతరాయంగా పోలియో చుక్కల కార్యక్రమం నిర్వహించడం వల్ల భారతదేశం పూర్తిగా పోలియో రహిత దేశంగా గుర్తించబడిందని, అలాగే తెలంగాణ ప్రభుత్వం అనేక ఆరోగ్య కార్య క్రమాల ద్వారా నిరంతరం ప్రజల ఆరోగ్యానికి కృషి చేస్తుందని ఈ కార్యక్రమాలని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు . దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక ఆరోగ్య కార్యక్రమాలు నిర్వహిస్తుందని వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని చెబుతూ ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ రూబెల్లా వ్యాక్సిన్ చిన్నప్పుడు తీసుకోకపోవడం వల్ల ఇప్పుడు ఆరోగ్యపరమైన సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది అని తెలిపారు. తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అందించే అన్ని కార్యక్రమాలను ప్రజలు ఉపయోగించుకోవాలని కోరారు. అలాగే నులిపురుగుల నివారణ కొరకు ప్రతి ఒక్కరూ ఒక సంవత్సరం నుంచి 19 సంవత్సరాల వయసు బాల బాలికలు అందరూ విధిగా ఈ సురక్షితమైన ఆల్బెండజోల్ టాబ్లెట్ తీసుకోవాలని, తద్వారా నులిపురుగులను న�