కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనాభా లెక్కలలో బీసీ కులాలను లెక్కించాలి

కుల గణన చేయకపోతే బిజేపీకీ రాజకీయ సమాధి తప్పదు
మునగాల, ఫిబ్రవరి 10 (జనంసాక్షి): భారతదేశంలో బీసీ కులాల లెక్క లేకపోవడం వలన 52% అనగా సగభాగం పైనే బీసీ కులాలు నష్టపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ గురువారం ఒక ప్రకటనలో అన్నారు. సామాజికంగా రాజకీయంగా ఉద్యోగ విద్య ఆర్థిక రంగాల్లో చాలా నష్టపోతున్నారన్నారు. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా కూడా బీసీలకు అన్యాయం జరుగుతూనే ఉందని, జనాభాలో అత్యధికంగా బీసీలు ఉన్నా కూడా కుల జన గణన జరగక పోవడం చాలా అన్యాయమని ఆయన అన్నారు. బ్రిటిష్ ఇండియా పాలనలో ఆరుసార్లు 1981 నుండి 1991 వరకు దేశంలో ఉన్న 6500 కులాలకు కుల ఆధారిత జనగనన లెక్కలు చేశారు. భారతదేశంలో స్వదేశీ పరిపాలన వచ్చిన తర్వాత నే బీసీలకు చాలా అన్యాయం జరిగింది. 2018లో కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ 2021లో జరగబోయే లెక్కల ప్రకారం బీసీల కులాలను లెక్కిస్తామని చెప్పారన్నారు. 2011లో యూపీఏ ప్రభుత్వ హయాంలో సోఫియో ఎకనామిక్స్ కాస్ట్ బెస్ట్ జనాభా లెక్కలు చేసిన వాటిని బయట పెట్టలేదు. 2018లో అప్పటి రాష్ట్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ 2021లో జరగబోయే జనగణనలో బీసీ కులాలు లెక్క ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు. అందుకనే బిజెపి పార్టీకి 2019 ఎన్నికల్లో బీజేపీకి మూడువందల పై చిలుకు ఎంపి స్థానాలు కైవసం చేసుకుందని అన్నారు. నరేంద్ర మోడీ బీసీలో ఎంబిసి కులానికి చెందిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రధాన మంత్రి అయ్యాడన్నారు. మోడీ ప్రధానమంత్రి అయితే బీసీ కులాల వారి కష్టాలు తీరుతాయని 80 కోట్ల బీసీ కులాలు భావించాయి. కానీ బీసీ కులాల పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టయిందన్నారు. భారతదేశ  అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్ట్ జనాభా  ప్రాతిపదికన రిజర్వేషన్లు బీసీలకు పెంచాలని, కేసులు వేసినప్పుడు కులాల జనాభా  లెక్కలు ఉంటే రిజర్వేషన్లు  జనాభా దామాశ ప్రకారం  పెంచవచ్చు అని, పలుమార్లు వెల్లడించిందన్నారు. కావున కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ బీసి కుల గనన చేసిన బీసి ప్రజల హక్కులు, విద్య ఉద్యోగ రాజకీయ ఆర్థిక రంగాలలో బీసిలకు 50%వాటా దక్కేలా న్యాయం చేయాలని, తెలంగాణా బీసి సంక్షేమ సంఘము పిలుపునిచ్చింది.