కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, టిబిజికెఎస్ సంఘం కపట నాటకం ఆపాలి…

సిపిఐ రాష్ట్ర నాయకులు కె సారయ్య….
జూన్ 9 (జనం సాక్షి) సింగరేణి కాలరీస్ వర్కర్స్ యునియన్ కేంద్ర కమిటీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కె సారయ్య శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా సారయ్య మాట్లాడుతూ సింగరేణి ప్రైవేటికరణ పై టిబిజీకెఎస్ దొంగ ధర్నాలు చేస్తు కార్మికులను మోసం చెస్తున్నారు అని ఆరోపించారు.
 కాంగ్రెస్ హయాంలో బొగ్గు బ్లాకులకు సంబంధించి స్కామ్ జరిగింది. తరువాత వచ్చిన బిజెపి ప్రభుత్వం మైన్స్,మినరల్స్ డెవలప్ మెంట్ రేగులాటరీ అథారిటీ చట్టాన్ని 2015 లో సవరించింది. సవరణ యొక్క వివరణ ఏంటంటే బొగ్గు బ్లాకులను వేలం ద్వారా అమ్మాలని సవరణ, అయితే ఈ బిల్లును పార్ల మెంట్లో పెట్టినప్పుడు పార్లమెంట్లో ఎన్డీయేకు సరిపడా బలం ఉన్నా  రాజ్యసభలో బలం లేదు,
కాబట్టి బిల్లు పాస్ కాదు. కానీ ఆనాడు టిఆర్ఎస్కు ఎంపీల సంఖ్య 15మంది, వైఎస్సార్సీపి కి ఒక సభ్యుడు శ్రీనివాసరెడ్డి అతను కూడా టిఆర్ఎస్ లో కలిసాక సభ్యుల సంఖ్య  16 కి పెరిగింది అన్నాడు. పార్లమెంట్లో టిఆర్ఎస్ పక్షాన నాయకత్వం వహిం చింది కల్వకుంట్ల కవిత, బాల్క సుమన్ ఉన్నారు. వీరు ఆ చట్టాన్ని సమర్ధించారు. వీరి సభ్యులు రాజ్యసభలో కూడా సమర్ధించారు. అదే సభలో ఝార్ఖండ్కు సంబందిచిన ఎంపి లు వ్యతిరేకించారు. అలాగే ఆ రాష్ట్ర ముఖ్య మంత్రి ఐన హేమంత్ సొరేన్ వ్యతిరేకించి, కోర్ట్కు కూడా వెళ్లడం జరిగింది. మనం ఇక్కడ టిఆర్ఎస్ ను ఎందుకు తప్పు పడుతు న్నాము అంటే తెలంగాణ ఉద్యమ పార్టీ,ఎన్నికల సమయంలో హామిలిచ్చిన పార్టీ కాబట్టి. ఝార్ఖండ్ రాష్ట్రం కూడా ఉద్యమం ద్వారా వచ్చిన రాష్ట్రం. అందుకే పోలిక  పార్లమెంట్ లో టిఆర్ఎస్ ఎంపిల
నిర్వాకమును చూసాం, ఇక టిబిజీకెఎస్ సంఘం సింగరేణిలో గుర్తింపుసంఘం,వారుకుడా ఎన్నికల సమయంలో వారి నాయకులే కాక స్వయానా ముఖ్యమంత్రి ఐన కెసిఆర్ తో కూడా ఓ సి లు కానియం,
యూజి మైన్స్ తెస్తాం,అవసర అయితే రాష్ట్రానికి చెందిన 51 శాతం కూడా ప్రభుత్వం కొంటది, కార్మికుల సంఖ్య పెంచుతాము అని మాట ఇచ్చి తప్పారు.
చివరగా ప్రయివేటు భూతాన్ని కేంద్రము పంపితే  ఆ భూతానికి పూర్తిగా సహ కరించింది,టిఆర్ఎస్ పార్టీ,టిబిజీకె