కేప్‌టౌన్‌లో పీటర్సన్ సెంచరీ పట్టుబిగించిన దక్షిణాఫ్రికా
కేప్‌టౌన్, జనవరి 3: న్యూజిలాండ్‌తో జరుగు తోన్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పూర్తిగా పట్టుబి గించింది. తొలి ఇన్నింగ్స్ కివీస్‌ను కుప్పకూల్చిన ఆ జట్టు బ్యాటింగ్‌లోనూ అదరగొట్టింది. రెండో రోజు ఒకసెంచరీ, మూడుహాఫ్‌సెంచరీలు నమో దు చేసి భారీ ఆధిక్యాన్ని సాధించింది. 3 వికెట్లకు 252 పరుగుల ఓవర్‌నైట్‌స్కోర్‌తో ఇవాళ ఇన్నిం గ్స్ కొనసాగించిన సఫారీలు ధాటిగా ఆడారు. పీట ర్సన్ సెంచరీ పూర్తి చేసుకోగా ఆమ్లా, కల్లిస్, డివీ లియర్స్ హాఫ్ సెంచరీలతో రాణిం చారు. ఆమ్లా, పీటర్సన్ రెండో వికెట్‌కు 107 పరుగులు జోడిం చగా కల్లిస్, పీటర్సన్ మూడో వికెట్‌కు 104 పరు గుల భాగస్వామ్యం నమోదు చేశారు. దీంతో సౌతాఫ్రికా స్కోర్ వేగంగా సాగింది. పీటర్సన్ 106, ఆమ్లా 66, కల్లిస్ 60 పరుగులు చేసి ఔట య్యారు. తర్వాత డివిలీయర్స్, ఎల్గర్ ఆరో వికె ట్‌కు 56 పరుగులు జోడించడంతో సౌతాఫ్రికా తొ లి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 347 పరుగుల దగ్గర డిక్లేర్ చేసింది. తద్వారా 302 పరుగుల ఆధిక్యా న్ని సాధించింది. కివీస్ బౌలర్లలో బౌల్ట్ 3, మార్టిన్ 3 వికెట్లు పడగొట్టారు. తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన న్యూజిలాండ్ మరోసారి ఆదిలోనే తడబడింది. ఖాతా తెరవకుండానే ఓపెనర్ గప్తిల్ డకౌటయ్యాడు. ప్రస్తుతం మెక్‌కల్లమ్, విలియ మ్సన్ క్రీజులో ఉన్నారు. మరో మూడు రోజుల ఆ ట మిగిలిఉన్న నేపథ్యంలో న్యూజిలాండ్ ఇన్నిం గ్స్ పరాజయం తప్పించడం కష్టమనే చెప్పాలి.