కేశవాపూర్‌లో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని రాస్తారోకో

 

హుస్నాబాద్‌: మండలంలోని కేశవాపూర్‌ గ్రామంలో ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతూ విద్యార్థులు రాస్తారోకో చేశారు. గ్రామం నుంచి హుస్నాబాద్‌కు 80మంది వరకు విద్యార్థులు చదువుకోవటానికి వెళ్తారు. గంటపాటు రాస్తారోకో నిర్వహించిన విద్యార్థులు బస్సు నడిపిస్తామని డిపో మేనేజర్‌ హామీ ఇవ్వటంతో ఆందోళన విరమించారు.