కేసీఆర్ ఢిల్లీ టూర్ సక్సెస్
కేంద్రమంత్రులు బీరేంద్రసింగ్, వెంకయ్యనాయుడుతో భేటీ
వాటర్ గ్రిడ్‌కు ప్రపంచబ్యాంకు నిధులు
విశ్వనగరంగా హైదరాబాద్
స్మార్ట్‌సిటీ తదితర అంశాలపై సానుకూలత
హైదరాబాద్ చేరుకున్న సీఎం
న్యూఢిల్లీ,ఫిబ్రవరి 9(జనంసాక్షి): తెలంగాణ సిఎం కెసిఆర్ ఢిల్లీ పర్యటన విజయవంతంగా ముగించుకున్నారు. రాష్టాన్రికి రావాల్సిన పథకాలు, నిధులపై ఆయన పలువురు కేంద్రమంత్రులను కలిశారు. కేంద్ర గ్రావిూణాభివృద్ది మంత్రి బీరేంద్ర సింగ్‌ను, పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యనాయుడులను కలిసి పలు అంశాలపై చర్చించారు. రాష్ట్ర అభివృద్దికి తోడ్పాటును ఇవ్వాలని కోరారు. బీరేంద్రసింగ్‌తో సీఎం కేసీఆర్ సమావేశం ముగిసిన అనంతరం సింగ్ విూడియాతో మాట్లాడారు. కాగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వాటర్‌గ్రిడ్ పథకం చాలా పెద్దది అని కేంద్ర మంత్రి బీరేంద్రసింగ్ పేర్కొన్నారు. ఈ పథకానికి ఆర్థిక సాయం అందేలా ప్రపంచబ్యాంక్ నిధులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. ఈ పథకం ఓ మంచి ప్రయత్నమని అన్నారు. వచ్చే బడ్జెట్‌లో తెలంగాణకు ఇవ్వాల్సిన నిధులు దృష్టిలో ఉంచుకుంటామని తెలిపారు. జలహారం చాలా పెద్ద పథకమని, ఈ పథకానికి ప్రపంచబ్యాంకు నిధులు వచ్చేలా చూస్తామని అన్నారు. వచ్చే బ్జడెట్‌లో తెలంగాణకు ఇవ్వాల్సినదాన్ని దృష్టిలో ఉంచుకుంటామన్నారు. రాష్ట్రంలోని పేదరిక నిష్పత్తిపై సవిూక్ష చేస్తున్నామని, వెనుకబడిన జిల్లాలను బ్లాకులుగా గుర్తిస్తున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. ఉపాధి హావిూ దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.రాష్ట్రంలోని పేదరిక నిష్పత్తిపై సవిూక్ష చేస్తున్నామని చెప్పారు. వెనుకబడిన జిల్లాలను బ్లాకులుగా గుర్తిస్తున్నామని పేర్కొన్నారు. ఉపాధిహావిూ పథకం దేశవ్యాప్తంగా ఒకేలా ఉంటుందన్నారు.
అనంతరం సీఎం కేసీఆర్ కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో భేటీ అయ్యారు. మద్యాహ్న విందుతోపాటు జరిగిన ఈ సమావేశం సుమారు రెండుగంటలపాటు సాగింది. స్మార్ట్ సిటీ, తదితర అంశాలలో కేంద్రం నుంచి సహకారం ఆశిస్తున్నామని ఈ సందర్బంగా కెసిఆర్ చెప్పారు. హైదరాబాద్ అభివృద్దికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. హౌసింగ్, పట్టణాభివృద్ధి, రోడ్లు, తాగునీరు, మరుగుదొడ్ల నిర్మాణం, స్మార్ట్ సిటీలు, హైదరాబాద్ అభివృద్ధిపై వెంకయ్యనాయుడితో చర్చించానని సీఎం చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి వెంకయ్యనాయుడు సహకారం అందిస్తామని చెప్పారని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం సానుకూలంగా ఉందని సీఎం కెసిఆర్ అన్నారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధికి సహకారమందిస్తుందని విశ్వాసం ఉందని సీఎం అన్నారు. అనంతనం వెంకయ్యమాట్లాడుతూ తెలంగాణ అభివృద్దికి కేంద్రం అన్ని విధాలుగా అండగా ఉంటుందని అన్నారు. తెలంగాణ అభివృద్దికి అన్ని విధాలా ఆదుకుంటామని అన్నారు. హైదరాబాద్ అభివృద్దికి సీఎం ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ బాగుందన్నారు. దీనికి అనుగుణంగా కేంద్రం తోడ్పాను ఇస్తుందన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు టీమిండయాలా పనిచేస్తామని వెంకయ్య పేర్కొన్నారు. తెలంగాణలో గృహనిర్మాణ పథకానికి సహకరిస్తామని వెంకయ్య హావిూ ఇచ్చారు. తెలంగాణకు ఏ సమస్య వచ్చినా తాము సానుకూలంగా స్పందిస్తామని ఆయన హావిూ ఇచ్చారు. కెసిఆర్ కూడా వెంకయ్యను పొగడడం విశేషం. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్యనాయుడు ఉండడం తెలుగు రాష్టాల్ర అదృష్టమని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఇళ్ల నిర్మాణ పథకాలు రాష్ట్రంలో అమలుచేయాలని వెంకయ్యను కోరామని, ఆయన సానుకూలంగా స్పందించారని కేసీఆర్ తెలిపారు. వెంకయ్యనాయుడు కేంద్రమంత్రిగా ఉండడం వల్ల సమస్యలకు పరిష్కారం దక్కుతుందన్నారు. తెలంగాణలో పట్టణాల అభివృద్ధి, నీటి సరఫరాపై కేంద్రమంత్రి వెంకయ్యతో చర్చించామని కేసీఆర్ వివరించారు. హైదరాబాద్ అభివృద్ధికి సహకరించాలని వెంకయ్యను కోరానని, దానికి ఆయన సానుకూలంగా స్పందించారని కేసీఆర్ పేర్కొన్నారు. నాలుగు రోజుల దిల్లీ పర్యటన ముగించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రధానితో జరిగిన నీతిఆయోగ్ సమావేశంలో పాల్గొన్నారు. పలువురు కేంద్రమంత్రులతో భేటీ అయ్యారు. షెడ్యూల్ ప్రకారం మరికొంత మంది మంత్రుల్ని కలవాల్సి ఉన్నా వారు అందుబాట్లో లేకపోవటంతో కేసీఆర్ పర్యటన షెడ్యూల్‌కంటే ఒకరోజు ముందే ముగించుకున్నారు.