*కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహని కి భూమి పూజ చేసిన మంత్రి*
కమ్మర్పల్లి27(జనంసాక్షి)కమ్మర్ పల్లి మండల కేంద్రంలో మంగళవారం రోజున కొత్త చౌరస్తాలో కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేసిన రాష్ట్ర రోడ్డు భవనాల శాఖామంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. తర్వాత స్థానిక పద్మశాలి సంఘం లో కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2001 వ సంవత్సరంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఏర్పడిన తరుణంలో పార్టీ ఆఫీసుకు ఎవరు ఇల్లు ఇవ్వడానికి కూడా ముందుకు రాని పరిస్థితుల్లో అప్పుడు కొండా లక్ష్మణ్ బాపూజీ స్వంత ఇంటిని పార్టీ ఆఫీసుగా ఇచ్చారని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం కోసం మంత్రి పదవి సైతం త్యాగం చేసిన గొప్ప వ్యక్తి ఆయనని కొనియాడారు. ఈరోజు అలాంటి మహనీయుని యొక్క విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ చేయడం నా అదృష్టమని మంత్రి అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కళాకారులకు ఇచ్చే అవార్డులకు కుడా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టడం చాలా సంతోషదాయకమని అన్నారు. అలాగే రాష్ట్ర ప్రజలందరూ కూడా గత ఎనిమిది సంవత్సరాల నుండి జరుగుతున్న అభివృద్ధిని గమనించాలని కోరారు. అలాగే దేశంలో 28 రాష్ట్రాలలో ఎక్కడా లేని విధంగా ఒక తెలంగాణ రాష్ట్ర0 లో మాత్రమే పేద ప్రజల సంక్షేమానికి అనేక విధాలైనటువంటి పథకాలను ప్రవేశపెట్టి ప్రజలను ఆదుకుంటుందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కమ్మర్పల్లి మండల పద్మశాలి సంగం అధ్యక్షులు చింత తిరుపతి, మండల కార్యవర్గ సభ్యులు అన్ని గ్రామాల పద్మశాలి సంఘాల అధ్యక్షులు సంఘ సభ్యులు పాల్గొన్నారు.