కొత్తగూడెంలో యాంటీగూండా స్క్వాడ్
ఖమ్మం, జూలై 12 జిల్లాలోని కొత్తగూడెం పట్టణంలో పెరుగుతున్న నేరాలను అదుపు చేసేందుకు యాంటీగూండా స్క్వాడ్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. ఇటీవల వివిధ ప్రాంతాల్లో ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. చిన్నపాటి గొడవలు, హత్యలు, హత్యాయత్నాలు, ముఠాతగాదాలు పెచ్చుమీరుతున్నాయి. కొత్తగూడెంలో ఉన్న మూడు స్టేషన్ల పరిధిలో ప్రజాందోళన రేకెత్తించి గొడవలు జరగడంతో ఎఎస్పీ భాస్కర్ భూషణ్ యాంటీగూండా స్క్వాడ్‌ను రంగంలోకి దించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా వివిధ స్టేషన్ల నుంచి ఒక్కో కానిస్టేబుల్‌ను కేటాయించి ఒక బృందంగా కేటాయించారు. ఒకటి, రెండు రోజుల్లో యాంటీగూండా స్క్వాడ్ విధులు ప్రారంభం కానున్నాయి.