కొప్పురాయిలో గర్భిణీలకు సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం

టేకులపల్లి, సెప్టెంబర్ 15( జనంసాక్షి ): టేకులపల్లి మండలంలోని కొప్పురాయి గ్రామపంచాయతీలో అంగన్వాడి కేంద్రం లో గర్భిణీలకు సీమంతాలు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం గురువారం ఘనంగా నిర్వహించారు. తల్లి పాల విశిష్టతను తెలిపేందుకు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నెలలో 30 రోజులు పాటు పోషణ మాసా వారోత్సవాల్లో భాగంగా కోప్పు రాయి గ్రామపంచాయతీలో గల అంగన్వాడీ కేంద్రంలో సూపర్వైజర్ సక్కుబాయి, అంగన్వాడీ టీచర్లు శ్రీలత, భద్రమ్మ ,కమల ,నర్సమ్మ ,మంగమ్మ, సీతా కుమారి, రాధ, రాంబాయి పాల్గొని పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, పిల్లలు అందరికీ తక్కువ ఖర్చుతో ఎక్కువ పోషక విలువలు కలిగిన ఆకుకూరలు ,కూరగాయలు, పండ్లు అందించాలని అవగాహన కల్పించారు. అదేవిధంగా అంగన్వాడి కేంద్రంలో పాలు ,గుడ్లు, అన్నం ప్రతిరోజు అంగన్వాడి కేంద్రం కు వచ్చి తినాలని వారు తెలిపారు.ఈ సందర్భంగా గర్భిణులకు సీమంతం చేసి పసుపు కుంకుమ అందజేశారు.