కొరియా ద్వీపకల్పంలో రణగర్జనలు

తూర్పు ఆసియాలోని కొరియా ద్వీపకల్పం (ఉత్తర కొరియా, దక్షిణకొరియాలు) లో యుద్ధ భయాలు ఆవరించాయి. అమెరికా కుటమి రాజ్యలైన జపాన్‌, తైవాన్‌, దక్షిణ కొరియాల మధ్య ఒంటరిగా జీవిస్తున్న చిన్న దేశం ఉత్తర కొరియా. ఉత్తర కొరియా తాజా అణు పరీక్షలు అమెరికాను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇంత కాలం తనకు ఎదురు లేదంటూ కండ కావరం తో విర్రవీగిన ప్రపంచాధినేత ఉత్తర కొరియా భీతిల్లేలా చేసింది. ఇప్పటికే పశ్చిమాసీయా నుండి మధ్య ఆసియా, ఇప్పుడు తూర్పు ఆసియాలో ఉత్తర కొరియా పరిణామాలు అమెరికా తలకి బొప్పి కట్టిస్తున్నాయి.
ఉత్తర కొరియా మూడవ సారి 2013 ఫిబ్రవరి 12న చేపట్టిన అణు పరీక్షల కార్యక్రమం పై  అమెరికి విరుచుకు పడడంతో కొరియాలో యుద్ధవాతవరణం తలెత్తింది.ఐక్యరాజ్య సమితి ఆంక్షలు పూర్వ రంగంలో తమ ఆర్ధిక వ్యవస్థ పునర్నిర్మా ణంతో పాటు అమెరికా అణ్వాయుధ ప్రమాదాన్ని నిలువరించేం దుకు అవసరమైన అణ్వాయుధాలను పెంచుకుంటామని ఉత్తర కొరియా నిర్వ్దందంగా ప్రకటించింది. ఉత్తర కొరియా చేస్తున్న యుద్ధ హెచ్చరికలను అమెరికా తీవ్రంగా పరిగణించింది. సైనిక ఒప్పందంలో భాగంగా దక్షిణ కొరియాకు మద్దతుగా అమెరికా తర బలగాలను అప్రమత్తంగా చేసింది. అందుకు ప్రతిగా ఉత్తర కొరియా దేశాధి నేత కిమ్‌జొంగ్‌ ఉన్‌ దేశంలో ‘యుద్ధ అత్యవసర స్థితి’ ని ప్రకటించారు. ఉత్తక కొరియా సరిహద్దు లోని కీ సాంగ్‌ ఉమ్మడి పారిశ్రామిక ప్రాంతంలో పని చేసేందుకు వస్తున్న దక్షిణ కొరియా కార్మికుల ప్రవేశాన్ని ఉత్తర కొరియా నిషేధించింది.
కొరియాల మధ్య తగాదాకు ఎంతో చరిత్ర వుంది. అనేక సహజ వనరులకు నిలయమైన మంచూరియాను స్వాధీనం చేసుకునే క్రమంలో జపాన్‌ 1945లో దురాక్రమణకు దిగగా, అంతకు ముం దు పెరల్‌ హార్బర్‌ దుర్ఘటనలో హిరోషిమ, నాగసాకీల పైన అమెరి కా తొలి అణుబాంబులతో దాడి చేసి లక్షలాది మంది పౌరులను బలిగొన్నది.
ఆసమయంలోనే మంచూరియా, కొరియాలను ¸దురా క్రమించి కూర్చున్న జపాన్‌ను ఎదుర్కోడానికి సోవియెట్‌ రెడ్‌ ఆర్మీ మంచూరీయా, కొరియా, సఖాలిన్‌, కురిల్స్‌ లోకి సేనల్ని నడిపించి విముక్తి చేసింది. 1910 నుంచి 1945 దాకా కొరియాను జపాన్‌ దురాక్రమించి, అధికారం వెలగబెట్టింది. ఇక్కడ అమెరికా రష్యా జపాన్‌ చైనాల ప్రయోజనాలు ఇమిడి ఉన్నాయి.
రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జపాన్‌ ఆధీనం నుంచి బయటికొచ్చిన కొరియా 1945 లో అగ్రరాజ్యాల మధ్య  ప్రభావిత ప్రాంతాల పంపిణీలో భాగంగా రెండు దేశాలుగా చీలిపోయింది. ఉత్తర భాగంగా పై సోవియట్‌ యూనియన్‌, దక్షిణ భాగం పై అమెరికా పట్టు సాధించాయి. ఐక్యరాజ్య సమితి ఆధ్వర్యంలో 1948లో ఎన్నికలు జరిగాయి. రెండు దేశాలూ సమితి ఆధ్వర్యంలో 1948లో ఎన్నికలు జరిగాయి. రెండు దేశాలూ స్వాతంత్య్రాన్ని ప్రకటించుకుని అధికారాన్ని చేపట్టాయి. యుద్ధానంతరం జరిగిన ఈ విభజనలో దక్షిణ కొరియాలో అమెరికాపలుకుబడితో దాని తైనాతీగా సింగ్మానరీ ప్రజాస్వామ్య వ్యతి రేక నిరంకుశ పాలనా వ్యవస్థకు అంకురార్ఫణ చేయగా, ఉత్తర కొరియా వర్కర్స్‌ సోషలిస్టు (కమ్యూనిస్టు) ప్రభుత్వ ం ఏర్పాటుకు నాటి సోవియట్‌ సోషలిస్టు కూటమి దోహదం చేసింది.
సరిహద్దు వివాదం కారణంగా 1950లో రెండు దేశాల మధ్య యుద్ధం మొదలైంది.దక్షిణ కొరియాకు ఐక్యరాజ్య సమితితో పాటు అమెరికా ,బ్రిటన్‌ సాయంగా నిలిచాయి. ఉత్తరకొరియాకు చైనా రష్యా మద్దతు పలికాయి. ఈ యుద్ధంలో ఆ రెండు దేశాలకు చైనా, అమెరికాకు చెందిన ఆరు లక్షల మంది సైనికులు చనిపో యారు. 1953లో ముద్ధ విరమణ ప్రకటించారు. 1991లో ఈ రెండు దేశాలను ఐరాస గుర్తించింది. 1970ల నుంచి దక్షిణ కొరియాతో కలిసి అమెరికా పైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది. స్వాతంత్రం ప్రకటించుకున్నప్పటి నుంచి ఉత్తరకొరియాను కిమ్‌ కుటుంబికులే పాలిస్తున్నారు. ప్రచ్ఛన్న యుద్ధానంతర కాలంలో రెండు కొరియాల మధ్య సంబంధాలు ఒక మేరకు మెరుగయ్యాయి. అనేక ఏళ్ళుగా సైనిక పాలనలో మగ్గుతున్న ఉత్తర కొరియాలో పేద రికం తాండవిస్తోంది. ఐక్య రాజ్య సమితి తరచు విధిస్తున్న ఆంక్షలు ఈ దేశ ఆర్థిక పురోగమనానికి సంకెళ్లు వేస్తున్నాయి. కొరియా చుట్టూ చెలరేగుతున్న రాజకీయాలకు ప్రధాన కారణం ఆసియాలోనే మూడు పెద్ద రాజ్యాలుగా ఉన్న సోవియట్‌, జపాన్‌, చైనాల మధ్య అది ఉండడమే.
రెండవ ప్రపంచ యుద్ధానంతరం మిత్రమండలి రాజ్యాల (అమెరికన్‌, పశ్చిమ రాజ్యాలు, సోషలిస్టు రాజ్యాలు) మధ్య కుదిరిన ఒప్పందాలను ఏదో ఒక మిషపైన ఉల్లంఘిస్తూ వచ్చిన అమెరికా పాలనా వ్యవస్థ విస్తరణవాద రాజకీయంతో దక్షిణ కొరియా కేంద్రంగా దక్షిణాసియా, ఆగ్నేయాసియా రాజ్యాలను, వాటి సహజ వనరులను యథేచ్ఛగా వాడు కోవడానికి, సోషలిస్టు దేశాలపై దురాక్రమణ యుద్ధాలకు కాలుదువ్వడానికి నిరంతరం ప్రయత్నిస్తునే ఉంది. ఆయుధ వ్యాపార ప్రయోజనాలకోసం స్థానిక యుద్ధాలను ఎప్పటికప్పుడు రెచ్చ గొడుతూనే ఉంది. అగ్రరాజ్యాలు మాత్రం స్వీయ రక్షణ పేరిట సంప్రదాయక ఆయుధాలనే కాదు, ఆధునిక, అత్యాధునిక అణ్వాయుధాలను కొల్లలుగా ఉత్పత్తి చేసుకోవచ్చుగాని, మరే దేశమూ వాటి ఛాయాలకు కూడా పోవ డానికి సాహించరాదన్నది అమె రికా దుర్నీతి. ఏ కొరియా ఏకీకర ణకూ, స్వాతంత్య్ర ప్రతిపత్తికీ అగ్ర రాజ్యాలు హామీ పడ్డాయో ఆ రెండు కొరియాల ఏకీకరణ సాధ్యం కాకుండా అమెరికా పాల కులు ఆది నుంచి అడ్డు కుంటు న్నారు. అమెరికా తన అధీనంలో ఉన్న దక్షిణ కొరియాకు ‘అణ్వస్త్ర’ గొడుగుపడుతూ ఉత్తర కొరియా లోని పాత, కొత్త పాలనాతరం తాటాకు చప్పుళ్లకు జడిపే రకం కాదు. తన శక్తి యుక్తులతో అదీ అణ్వస్త్రశక్తిగా ఇటీవల అవతరిం చింది.
ప్రస్తుతం ఉత్తర కొరి యా తీరం వెంబడి వేలాది మం ది అమెరికన్‌ సైనికులు, నావికా, వైమానికి దళాలను మోహరిస్తూ యుద్ధ క్రీడకు అమెరికా సన్నద్ధ మవుతుంటే, మరో వైపు దూకు డుకు వ్యతిరేకంగా అనేక మంది అమెరికన్లు రోడ్డెక్కుతున్నారు. లాస్‌ ఏంజెల్స్‌కు చెందిన ఇంటర్నేషనల్‌ యాక్షన్‌ సెంటర్‌ అనే సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడి కొరియా వలస కార్మికుల సంఘం మిన్‌జోక్‌టాంగ్‌షిన్‌, ఇతర కొరియా సంఫీుభావ సంఘాల సభ్యులు ఇటీవల లాస్‌ ఏంజెల్స్‌లో పైనిక నియామక కేంద్రం ముందు భారీ భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతిని కాపాడండి, ఉత్తర కొరియాతో శాంతి అవగాహన కుదుర్చు కోండి. అంటూ వారు ఒబామా సర్కారును డిమాండ్‌ చేశారు.
అయితే ఉత్తర కొరియాలోని సోషలిస్టు ప్రభుత్వాన్ని కూల్చి వేయాలని మొదటి నుండి పట్టు వీడకుండా అమెరికా కుట్రలు కుతంత్రాలు సాగిస్తూనే ఉంది. అమెరికా కుట్రలను ఎప్పటి కప్పుడు ఉత్తర కొరియా తిప్పికొడుతూ వస్తుంది. ఉత్తర కొరియాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి అటు రిపబ్లికన్లు, ఇటు డెమొక్రాట్‌ల నేతృత్వంలోని ప్రభుత్వాలు వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ నిరాయుధీకరణ ఒప్పందం అమలు లో వుంది. అమెరికా అదే వైఖరిని కొనసాగిస్తే తాము నిరాయుధీకరణ ఒప్పందాన్ని గుర్తించబోమని, తమ భూభాగాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే అమెరికా, దాన్ని కీలు బోమ్మలకు తగిన బుద్ధి చెబుతామని ఒబామా సర్కారును హెచ్చరించింది.
(ఇంకావుంది)
(రచయిత ఉపాధ్యాయ ఉద్యమ నాయకులు,
రాజనీతి శాస్త్ర విద్యార్థి)