సామాన్యుడి సంక్షేమానికి కెసిఆర్ పెద్దపీట
వ్యవసాయరంగంలో తిరుగులేని ఆధిక్యం
మల్లన్న సాగర్ª`తో అద్భుతం ఆవిష్కారం
మంత్రి వేమల ప్రశాంతరెడ్డి వెల్లడి
నిజామాబాద్,ఫిబ్రవరి23(ఆర్‌ఎన్‌ఎ): సీఎం కేసీఆర్ పాలనలో వ్యవసాయం బాగుపడిరదని మంత్రి వేముల ప్రశాంతరెడ్డి అన్నారు. మల్లన్న సాగర్ సాకారంతో కాళేశ్వరం కల పూర్తిగా సాకారం అయ్యిందన్నారు. విపక్షాలు విమర్శలు మాని ఇక అంతా మల్లన్న సాగర్‌ను, కొండపోచమ్మ సాగర్‌ను చూస్తే నీటి రాక ఎలా ఉందో తెలుస్తుందన్నారు. ప్రాజెక్టులకు నిధులతో సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. కాగితం పులులు, సోషల్‌విూడియాలో దుష్పచ్రారంతో పబ్బం గడుపుతున్న ప్రతిపక్షాలకు మల్లన్న సాగర్ చెంపపెట్టుగా మారిందన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజల కోసమే ఆలోచించే ప్రభుత్వమని రుజువైందని తెలిపారు. తెలంగాణను కోటిఎకరాల మాగాణిగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని, సీఎం అద్భుత పాలనతో దేశానికే రోల్ మోడల్‌గా నిలిచారన్నారు. అనేక సంక్షేమకార్యక్రమాలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని అన్నారు. టీఎస్‌ఐపాస్ ద్వారా ఐటీ రంగంలో మెరుగైన ప్రగతిని సాధించుకున్నామని తెలిపారు. హైదరాబాద్‌ను దేశంలోనే సురక్షితమైన నగరంగా తీర్చిదిద్దామన్నారు. విమర్శలు చేస్తున్న బిజెపి నేతలు కేంద్రం ఏం చేసిందో చెప్పాలన్నారు. పెట్రో దరలు పెంచడం తప్ప చేసిందేవిూ లేదన్నారు. పేదల సంక్షేమం కోసం ప్రతి ఏటా రూ. 40వేల కోట్లు కేటాయింపులు చేసినట్లు తెలిపారు. వృద్ధాప్య పెన్షన్ అర్హత 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గింపు చేయడం జరిగిందని, ఒంటరి హహిళలు, దివ్యాంగుల, వితంతువుల పెన్షన్లు రెట్టింపు చేశామన్నారు. రైతులకు ఏడాదికి రూ. పదివేల పంట పెట్టుబడి ఇస్తున్నామని, అభివృద్ధి సంక్షేమంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందన్నారు. కుల, మతాలతో సంబంధం లేకుండా డబుల్‌బెడ్ రూం ఇండ్లు ఇస్తున్న ప్రభుత్వం తెరాసేనని మంత్రి అన్నారు. రైతుల అభివృద్ధి కోసం రూ. 50 వేల కోట్లకు పైగా కేటాయించడం గొప్ప విషయమని, తద్వారా రైతుల ఆత్మహత్యలు, ఆకలి చావులు నిర్మూలించగలిగామని అన్నారు. వ్యవసా యాన్ని పండగలా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని, తెలంగాణ ఏర్పడితే కరెంట్ ఉండదని సమైక్య పాలకులు భయపెట్టారని, సీఎం కేసీఆర్ కృషితో 24 గంటల నిరంతర నాణ్యమైన కరెంట్ అందివ్వగలుగుతున్నా మని అన్నారు. మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామిని నెరవేర్చినట్లు ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు జిల్లాల విభజన, మండలాల ఏర్పాటు చేయలేక అభివృద్ధి కుంటపడిరదని అన్నారు. చిన్న మండలాలు, జిల్లాల ఏర్పాటుతో అభివృద్ధి ఫలాలు ప్రతిఒక్కరికి అందుతాయనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ జిల్లాలను, మండలాలను ఏర్పాటు చేశారన్నారు. ఇలా అన్ని రంగాల్లో కేసీఆర్ తన అద్భుతమైన ఆలోచనతో, అన్ని వర్గాల ప్రజలు బాగు పడాలనే దృకత్పంతో ముందుకెళ్తున్నారని మంత్రి వేముల అన్నారు.