క్రికెట్ నుంచి ‘బ్రెట్‌లీ’ రిటైర్
మెల్‌బోర్న్, జూలై 13 : తాను అంతర్జాతీయ క్రికెట్ నుంచి విరమించుకుంటున్నట్టు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ బ్రెట్‌లీ శుక్రవారం ప్రకటించారు. సుమారు 13 సంవత్సరాలుగా ఆయన క్రికెట్ మ్యాచ్‌లను ఆడుతున్నారు. గాయాల వల్ల 2010లో టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఇప్పుడు వన్డేల నుంచి కూడా విరమించుకున్నారు. ఆయన గిటార్ వాద్యకారుడు కూడా. భారత్‌లో ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. తన శరీరం సహకరించకపోవటం వల్ల ఇక క్రికెట్‌లో కొనసాగలేనని చెప్పారు. 13 ఏళ్లు ఉన్నత స్థానంలో ఉండటం కలగా మిగిలిపోయిందన్నారు. అంత కన్నా తాను ఎక్కువగా ఆశించటం లేదన్నారు. శ్రీలంకలో ట్వంటీ 20 ప్రపంచ్ కప్ పోటీలలో పాల్గొనాలని ఆయన అనుకున్నా వీలు కాలేదు. కొద్ది నెలలుగా రిటైర్‌మెంట్ గురించే తాను ఆలోచిస్తున్నట్టు తెలిపారు. వార్న్, మెక్‌గ్రాత్, ఆడమ్ గిల్‌క్రిస్ట్, స్టీవ్, మార్క్‌వా తదితర ఆటగాళ్లతో కలిసి ఆడటం అద్భుతమైన అనుభవమని చెప్పారు.