క్రిష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన పోలీస్,

, రెవెన్యూ సిబ్బంది
– క్రిష్ణ రైల్వే బ్రిడ్జ్ సమీపంలోని వరద నీటిని పరిశీలించిన డీఎస్పీ, ఆర్ డి ఓలు

మక్తల్, జూలై 9 (జనం సాక్షి)

గత రెండు మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా క్రిష్ణా నది పరివాహక ప్రాంతాల ప్రజలను పోలీసు రెవెన్యూ అధికారులు అప్రమత్తం చేశారు. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల క్రిష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని శనివారం సాయంత్రం డి.ఎస్.పి కె. సత్యనారాయణ , ఆర్ డి ఓ. రామచందర్ లు రెవిన్యూ అతనితో కలిసి స్వయంగా క్రిష్ణ పోలీస్ స్టేషన్ పరిధిలోనీ క్రిష్ణ బ్రిడ్జి దగ్గర, హిందూపూర్ గ్రామ ప్రజలతో స్వయంగా వెళ్లి మాట్లాడారు. ప్రజలు ఎవ్వరు పుట్టి లలో నదిలోకి చేపల వేటకు వెళ్లరాదని, పిల్లలు ఈతలకు వెళ్ళదరాదని, సెల్ఫోన్లతో నది దగ్గర సెల్ఫీలు తీసుకోరాదని, నది పరివాహక ప్రాంత గ్రామ ప్రజలు మేకలు, పశువులను మేత కొరకు నది ఒడ్డుకు తీసుకెళ్లరాదని తెలిపారు. భారీగా కురుస్తున్న వర్షాల వల్ల కర్ణాటక, నారాయణపూర్ డ్యాం నుండి ఎప్పుడైనా వరదలు రావచ్చని నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ, ఇరిగేషన్, సంబంధిత అధికారులు ప్రజలను అప్రమత్తం చేయాలని వారికి సూచించారు. ప్రజలు అత్యవసర సమయంలో కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని కంట్రోల్ రూమ్ నీ సంప్రదించాలని, లేదా డయల్ 100 కి కాల్ చేసి పోలీసు వారికి సమాచారం ఇవ్వాలని తెలిపారు. నది పరివాహక ప్రాంతాన్ని పరిశీలించిన వారిలో తాసిల్దార్ జయరాం, డిప్యూటీ తాసిల్దార్ రామ్కోటి, కృష్ణ ఎస్సై విజయభాస్కర్, స్థానిక నాయకులు, ప్రజలు ఉన్నారు.