క్రీడలతో మానసిక ఒత్తిడిని జయిస్తారు

తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 29 :: క్రీడలతో మానసిక ఒత్తిడిని జయించి మను ధైర్యాన్ని ఇస్తుందని జిఎంఆర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రాజెక్టు మేనేజర్ వెంకటరమణ పేర్కొన్నారు జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జి.యం.అర్ వరలక్ష్మి ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిపిఈఎల్ మరియు రక్ష ఉద్యోగులకు క్రీడా సామగ్రిని పంపిణీ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు
జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరిచుకుని జి.యం.అర్ వరలక్ష్మి ఫౌండేషన్ వారు జి.యం.అర్ పోచంపల్లి ఎక్స్ ప్రెస్ వేస్ లిమిటెడ్ లో గల ఉద్యోగులకు ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటరమణ మాట్లాడుతు సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు ప్రతి రోజు
క్రీడలు ఆడడం వల్ల
ఉద్యోగుల మానసిక శ్రేయస్సును మెరుగుపరుస్తాయని, ఒత్తిడి, ఆందోళన మరియు నిరాశను తగ్గిస్తుంది అని అన్నారు ప్రతిరోజు క్రీడలు ఆడటం వల్ల ఆరోగ్యంగా ఉంటారని ఎలాంటి వ్యాధులు రాకుండా ఉంటారని ఆయన తెలిపారు
జి.యం.అర్ వరలక్ష్మి ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడుతు ఉద్యోగులలో ధైర్యాన్ని మరియు జట్టుకృషిని మెరుగుపరచడానికి మరియు ఉద్యోగులను పనిలో మరింత సమర్థవంతంగా మరియు ప్రభావవంతంగా పనిచేయడానికి క్రీడలు దోహద పడతాయి అని, ఈ సందర్బంగా సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులకు క్రీడా సామగ్రిని అందజేసి వివిధ క్రీడలలో పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశామని తెలియజేసారు. ఈ కార్యక్రమంలో జి.యం.అర్ పోచంపల్లి ఎక్స్ ప్రెస్ వేస్ లిమిటెడ్ సభ్యులు వెంకటరమణ, పరందమన్, ప్రవీణ్ కుమార్, లక్ష్మణ్ రావు, సతీష్ పట్నాయక్, నారాయణన్, వసంతసాయి , సాయి బాబా, రక్ష సిబ్బంది మంగయ్య, మహేందర్ రెడ్డి, రామక్రిష్ణ, బింరావు, ఫౌండేషన్ ప్రతినిధి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.