క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు

మెట్‌పల్లి గ్రామీణం: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని తహశీల్దార్‌ భూపతి రెడ్డి, ఎంపీడీవో లక్షీనారాయణ అన్నారు. మెట్‌పల్లి మండలం వేం పేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నెహ్రూ యువకేంద్రం ఆధ్వర్యంలో మెట్‌పల్లి పాత తాలూకా స్థాయి బాలికల ఖోఖో పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో ఐదు జట్లు పాల్గొనగా వేం పేట జట్టు విజేతగా నిలిచింది. విజేతలకు తహశీల్దార్‌, ఎంపీడీవో చేతుల మీదుగా బహుమతులు అందజేశారు.