క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి:ఎమ్మెల్యే బొల్లం

అనంతగిరి జనంసాక్షి:
సూర్యాపేట జిల్లా అనంతగిరి మండల పరిధిలో గల అనురాగ్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో పంచాయతీరాజ్ శాఖ అనంతగిరి వారి నిర్వహిస్తున్న జిల్లా స్థాయి పంచాయతీరాజ్ క్రికెట్ టోర్నమెంట్(కాకతీయ కప్)ను కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.క్రీడల సాధన కు గ్రామాల్లో ప్రభుత్వం క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తుందన్నారు.క్రీడలతో శారీరక మానసిక వికాసం కలుగుతుందన్నారు.ఉద్యోగ ఒత్తిడిలో ఉండి వాటి నుండి బయట పడేందుకు క్రీడలు ఎంతో దోహదపడుతాయన్నారు.పంచాయితీ కార్యదర్శులు క్రికెట్లో రాణించి కోదాడకు మంచి పేరు తేవాలన్నారు.అన్ని తానై దాతగా నిలిచిన కిష్టాపురం గ్రామానికి చెందిన ఎన్నారై కత్రం శ్రీకాంత్ రెడ్డికి ప్రత్యేక అభినందనలు తెలిపారు.మొదటి బహుమతి పొందిన అనంతగిరి పంచాయతీ కార్యదర్శులకు వారి చేతుల మీదుగా బహుమతులు అందచేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో కోదాడ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి,ఎంపీపీలు చింత కవిత రాధారెడ్డి,చుండూరు వెంకటేశ్వర్లు,ఇన్చార్జి ఎంపీడీవో నాగేశ్వరరావు,మండల పార్టీ అధ్యక్షులు గింజపల్లి రమేష్,సర్పంచుల పోరం అధ్యక్షులు జొన్నలగడ్డ శ్రీనివాసరావు,నాయకులు పుల్లారెడ్డి,బాపూజీ రెడ్డి,సర్పంచు కోటేశ్వరరావు,మోజస్,పంచాయతీ కార్యదర్శిలు,తదితరులు పాల్గొన్నారు.
ఫోటో రైట్ అప్: ఎమ్మెల్యే చేతుల మీదుగా బహుమతిని అందుకుంటున్న అనంతగిరి పంచాయతీ కార్యదర్శులు.
Attachments area