క్రీడాకారులను అభినందిస్తూ సన్మానించిన ఎస్పి వెంకటేశ్వర్లు

క్రీడా పాఠశాలకు ఎంపికైన మక్తల్ విద్యార్థులు

మక్తల్, జూలై 16 (జనం సాక్షి న్యూస్)

 

క్రీడా పాఠశాలకు ఎంపికైన మక్తల్ విద్యార్థులను శనివారం నారాయణపేట జిల్లా ఎస్పీ వెంకటేశ్వర్లు క్రీడాకారులను అభినందిస్తూ ఘనంగా సత్కరించారు.
తగ్ ఆఫ్ వార్, మాస్టర్స్ అథ్లెటిక్స్ ,షూటింగ్ బాల్ అసోసియేషన్స్ నారాయణపేట జిల్లా ఆధ్వర్యంలో మక్తల్ మినీ స్టేడియం గ్రౌండ్లో గత మే నెలలో ఉచిత వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో క్రీడా పాఠశాలకు సంబంధించిన తొమ్మిది క్రీడాంశాలలో మెరుగైన శిక్షణ పొంది, మక్తల్ కు చెందిన నలుగురు విద్యార్థులు బిందుప్రియ ,అశ్విని, శివలింగప్ప ,జి .వినయ్ తెలంగాణ రాష్ట్ర మేడ్చల్ జిల్లాలో గల హకీంపేట క్రీడా పాఠశాలకు ఆరో తరగతికి ఎంపికైన నలుగురు విద్యార్థులను నారాయణపేట జిల్లా సుపరింటెంట్ ఆఫ్ పోలీస్, వెంకటేశ్వర్లు. షాలువ , మెమొంటోలతో ఈ నెల 16న ఎస్పీ కార్యాలయంలో ఘనంగా సన్మానించినట్లు అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విశ్రాంత పీఈటి, బి .గోపాలం శనివారము రోజు ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడా పాఠశాలకు ఎంపికైన నలుగురు విద్యార్థులను అందుకు కృషి చేసిన పి ఈటిలను బి గోపాలం, అమ్రేష్, దామోదర్, రమేష్ , బి .రూప లను వారు అభినందిస్తూ, క్రీడా పాఠశాలలో విద్యార్థులు చదువుతోపాటు క్రీడలలో రాణించి రాష్ట్ర జాతీయస్థాయి అంతర్జాతీయ స్థాయి క్రీడలలో పాల్గొని నారాయణపేట జిల్లాకు కీర్తి ప్రతిష్టలను తీసుకురావాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో మక్తల్ సిఐ సీతయ్య,తగ్గాఫ్ వార్, మాస్టర్స్ అథ్లెటిక్స్, షూటింగ్ బాల్ అసోసియేషన్స్ అధ్యక్షులు రఘు ప్రసన్న బట్, సత్య ఆంజనేయులు, జి .గోపాల్ రెడ్డి, గౌరవ అధ్యక్షుడు తాన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బి.గోపాలం, ఉపాధ్యక్షులు బి. శ్రీనివాసులు, అంజయ్య ఆచారి ,నిర్వహణ కార్యదర్శులు అమ్రేష్, దామోదర్ ,రమేష్, బి. రూప తల్లిదండ్రులు శ్రీధర్ రెడ్డి, జయేందర్ పాల్గొన్నారు.