గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలి.

– నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.
– ఊరుకొండ ఎస్సై ఎమ్.లక్ష్మణ్.
ఊరుకొండ, ఆగస్టు 28 (జనం సాక్షి):
వినాయకచవితి ఉత్సవాలలో ఏలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని
ఊరుకొండ ఎస్సై ఎమ్.లక్ష్మణ్ సూచించారు. ఆదివారం స్థానిక పోలీస్ స్టేషన్ లో ఎస్సై విలేకరులతో మాట్లాడుతూ… ఊరుకొండ మండల కేంద్రంతో పాటు మండల పరిధిలోని అన్ని గ్రామాలలో వినాయకచవితి ఉత్సవాలు ఈనెల 31న ప్రారంభం అవుతున్నందున గణేష్ మండప నిర్వాహకులు ఊర్కొండ మండల పోలీస్ వారి ముఖ్య సూచనలు పాటించాలని కోరారు. విగ్రహానికి/మండపానికి సంబందించిన పూర్తి సమచారాన్ని… https://policeportal.tspolice.gov.in/indexhtm Website నందు నమోదు చేసుకొని, దాని print తీసుకోవాలని, ప్రింట్ కాపీ తో పాటు కరెంట్ డిపార్ట్మెంట్ వారి అనుమతి పత్రము మరియు సంబంధిత స్తలము యజమాని/ గ్రామ పంచాయితీ అధికారి అనుమతి పత్రము.
మైక్ పర్మిషన్ పత్రము(మీ సేవ ద్వారా చలాన్ కట్టి తీసుకున్నది). జతపరిచి పోలీస్ స్టేషన్ లో ఇవ్వవలెనని పేర్కొన్నారు. మండపాలను రోడ్డు మధ్యలో కాకుండా ఒక పక్కకు వేసుకొని వాహనాలు మరియు ప్రజలు వెళ్ళటానికి దారి వదల వలెనని, విద్యుత్ వైర్ల కింద మండపాలు ఏర్పాటు చేయరాదని సూచించారు. నిర్వాహకులు రాత్రి పూట మండపాల వద్దే పడుకోవాలని, లైటింగ్ వుండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. పెద్ద మండపాల వద్ద తాత్కాలికంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని, ఊరేగింపులో డీజేలు నిషేదం అని అన్నారు. అత్యవసర సమయంలో 100 కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఎస్సై సూచించారు.