గత సర్కారు తప్పిదాలే మళ్లీ చెయ్యొద్దు ` బీజేపీ
కరీంనగర్(జనంసాక్షి):కాంగ్రెస్, భారాస నేతలు అవకాశవాదులని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. అసెంబ్లీలో రెండు పార్టీలు కలిసే భాజపాకు వ్యతిరేకంగా తీర్మానం చేసింది నిజం కాదా? అవకాశమొస్తే కాంగ్రెస్‌లో భారాస విలీనమవడం ఖాయం అని ఎద్దేవా చేశారు. బ్రోకర్లకు కవిూషన్లు ఇచ్చి మర్చంట్ బ్యాంకర్స్ ద్వారా అధిక వడ్డీలకు వేల కోట్లు అప్పు తెచ్చే కుట్రకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరతీసిందని మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. అధిక వడ్డీలకు అప్పు తీసుకువస్తే రాష్ట్ర ప్రజలపై మోయలేని భారం పడబోతుందన్నారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ జరపాల్సిందేనని చెప్పారు. కాళేశ్వరంపై ఆ రెండు పార్టీలు కలిసి డ్రామాలాడుతున్నాయి. మూసీ రివర్ ఫ్రంట్‌పై కేంద్రాన్ని నిధులు అడిగిన రాష్ట్ర ప్రభుత్వం.. బడ్జెట్లో ఎందుకు భారీ నిధులు కేటాయించలేదో సమాధానం చెప్పలేదని బండి సంజయ్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పైనా బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. ఇచ్చిన హావిూలకు సంబంధించి బడ్జెట్ ఎలాంటి కేటాయింపులు చేపట్టలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌లో ఆదాయానికి, వ్యయానికి పొంతనే లేదన్నారు. కాంగ్రెస్ 420 హావిూలకు బడ్జెట్‌లో కేటాయింపులు లేవన్నారు. రుణమాఫీకి 30 వేల కోట్లు అవసరమని చెప్పి.. కేవలం 15 కోట్లు మాత్రమే కేటాయించారన్నారు. రైతు భరోసా ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రధాని ఫోటో పెట్టి తీరాల్సిందే అని స్పష్టం చేశారు. రాష్టాన్రికి సహకరించేందుకు కేంద్రం సిద్ధంగా ఉందని మరోసారి స్పష్టం చేశారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను విూరు చేయవద్దని బండి సంజయ్ హితవుపలికారు. కాళేశ్వరంకు పోయిన వాళ్ళందరూ నాస్తికులే అని.. అందుకే గుడి యొక్క సాంప్రదాయాలను పాటించలేదని బీఆర్‌ఎస్ నేతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. గర్భగుడి లోపలికి వెళ్లేముందు ఎలా ఉండాలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు తెలీదా అని ప్రశ్నించారు. గర్భగుడిలోకి వెళ్లే భక్తులు సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లాలని గుడి వద్ద బోర్డు ఉంటుందన్నారు. దీన్ని ధిక్కరించి బీఆర్‌ఎస్ నేతలను గుడిలోకి వెళ్లారని విమర్శించారు. టెంపుల్ ముందు బోర్డు కనపడలేదా..కళ్ళు దొబ్బినాయా కేటీఆర్ అంటూ మండిపడ్డారు. అసలు కేసీఆర్ కొడుకు కేటీఆర్ దేవుడిని నమ్ముతారా.. ఆయన అతి పెద్ద నాస్తికుడు అంటూ వ్యాఖ్యలు చేశారు. గుడికి వెళ్లిన వారిలో సంగం మంది నాస్తికులే కాబట్టి అక్కడి సాంప్రదాయాలను పాటించలేదని మండిపడ్డారు. ఇది పూర్తి హిందూ ధర్మాన్ని అవమానించినట్లే అని అన్నారు. తాము ఉన్నామని చెప్పుకోవ డానికి బీఆర్‌ఎస్ ఇన్ని పాట్లు పడుతోందన్నారు. కాళేశ్వరం సందర్శించి ఏం సాధించారని ప్రశ్నించారు. తప్పు జరలేదు అన్న విషయాన్ని కూడా చెప్పలేకపోయారన్నారు. కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేకపోయారని ఎద్దేవా చేశారు. అక్కడకు వెళ్లి కేవలం దేవుడిని అవమానించడం తప్ప సాధించింది ఏవిూ లేదన్నారు. హిందూ సమాజానికి బీఆర్‌ఎస్ క్షమాపణలు చెప్పాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఎన్డీఎస్‌ఏకు పోలవరంపై లేని శ్రద్ధ కాళేశ్వరంపై ఎందుకన్న కేటీఆర్ వ్యాఖ్యలపై బండి మండిపాడ్డారు. కాళేశ్వరంలో తప్పు జరిగిందని కేటీఆర్ ఒప్పుకున్నట్టేనా అని ప్రశ్నించారు. పోలవరానికి కాళేశ్వరంకు లింక్ ఎందుకు అని అడిగారు. పోలవరంలో తప్పు జరిగితే.. ఫిర్యాదు చెయ్యి కేటీఆర్ అని అన్నారు. కాళేశ్వరంలో కేసీఆర్ లక్ష కోట్లు తిన్నారని దుయ్యబట్టారు. అవకాశం ఉంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో బీఆర్‌ఎస్ కలిసినా ఆశ్చర్యపోనవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ గురించి ప్రజల్లో చర్చ లేదన్నారు. ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా బీఆర్‌ఎస్‌ను వీడుతున్నారన్నారు. తెలంగాణ అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నేతలు ఒక్కటయ్యారని… బీజేపీ ఎమ్మెల్యేలు హీరోలుగా ఫైట్ చేశారన్నారు. వికసిత్ భారత్ అజెండాగా నీగి ఆయోగ్ సమావేశం ఈరోజు జరగబోతోందని తెలిపారు. 2047 భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చడమే లక్ష్యంగా ఈ సమావేశం జరుగుతోంది. అన్ని రాష్టాల్రు ఇందులో పాల్గొని సలహాలు ఇవ్వాలని అన్నారు. ఇందులో పాల్గొనేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇబ్బంది ఏంటని ప్రశ్నించారు. అసెంబ్లీ వేదికగా కేంద్రాన్ని దూషించారు కాబట్టే.. తిరిగి మొహం చెల్లక నీతి ఆయోగ్ సమావేశానికి కాంగ్రెస్ హాజరు కావడంలేదని అన్నారు. ఇది ముమ్మాటికి తెలంగాణ రాష్టాన్న్రి నష్టాన్ని చేకూరుస్తుందని కేంద్రమంత్రి వెల్లడిరచారు.. కొంత మంది మంత్రుల భాషను చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. విమర్శలు చేయాలి తప్ప వ్యంగ్య వ్యాఖ్యలు సరికాదని.. గత ప్రభుత్వం మాదరిగా ఇప్పటి ప్రభుత్వంలోని మంత్రులు కూడా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కలిసి బీజేపీపై విమర్శలు గుప్పిస్తారన్నారు. కేంద్ర సహాకారాన్ని కేసీఆర్ తీసుకోలేదని.. అందుకు రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిరదని కొత్త అసెంబ్లీ సాక్షిగా మంత్రులే దుయ్యబట్టారని తెలిపారు. గత పదేళ్లుగా కేసీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్ మాట్లాడలేదన్నారు. గత పదేళ్లలో తెలంగాణకు కేంద్రం పదిలక్షల నిధులను కేటాయించిందని వెల్లడిరచారు. గత ఏడాది తెలంగాణ పర్యాటనలో భాగంగా పలు జిల్లాలో అనేక అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేశారన్నారు. కమిషన్లకు కక్కుర్తి పడి కేంద్రం నుంచి కాకుండా పక్క రాష్టాల్ర నుంచి ఎక్కువ ధరకు కేసీఆర్ కరెంట్‌ను కొనుగోలు చేశారని మండిపడ్డారు. కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్ కూడా కేంద్రానికి సహకారం అందిస్తారా? లేక గత ప్రభుత్వం మాదిరిగానే ఎక్కువ ధరకు విద్యుత్‌ను కొనుగోలు చేస్తారా అని ప్రశ్నించారు. కేసీఆర్ కొడుకు కేటీఆర్ అహంకారం ఏమాత్రం తగ్గలేదన్నారు. గతంలో షాడో సీఎంగా ఉన్న నువ్వు.. వరంగల్ టెక్స్‌టైల్ పార్క్‌ను ఏర్పాటు చేసినప్పుడు సిరిసిల్లలో టెక్స్‌టైల్ పార్క్ పెట్టాలని కేంద్రాన్ని గతంలో ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. నిన్నటి రాష్ట్ర బడ్జెట్‌లో సిరిసిల్ల రాష్ట్ర పరిశ్రమపై ఎందుకు ప్రస్తావించలేదని నిలదీశారు. తెలంగాణకు కేంద్రం ఎంతో చేసినప్పటికీ నిన్నటి అసెంబ్లీలో కేంద్రానికి వ్యతిరేకంగా శాసనసభ తీర్మానం చేయడం దుర్మార్గమన్నారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమా?.. లేక కోట్లాటలా అని ప్రశ్నించారు. కేసీఆర్ పంధాన్నే నేడు కాంగ్రెస్ సర్కార్ పాటిస్తోందని విరుచుకుపడ్డారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు లేవన్న విమర్శలో నిజం లేదని అన్నారు. మహిళలు, యువత, రైతు బడ్జెట్ అని అన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు రూ.రెండు లక్షల కోట్లు, యూత్ ఎంప్లాయిమెంట్, స్కిల్ డెవలెప్‌మెంట్ కోసం లక్షా నలభైఎనిమిది వేల కోట్లు, మహిళల అభవృద్ధికి మూడు కోట్లు, గ్రావిూణ అభివృద్ధి కోసం రెండు లక్షల ఆరవై ఆరువేల కోట్లు కేంద్ర బడ్జెట్లో కేటాయించినట్లు తెలిపారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు కేటాయింపులు జరిగాయన్నారు. రాబోయే ఐదేళ్లలో 20లక్షల మంది యువతీయువకులకు శిక్షణ ఇచ్చి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలని బడ్జెట్‌లో స్పష్టం చేసింది. ఉన్నత విద్యను చదివే విద్యార్థులు పది లక్షల వరకు రుణసహాయాన్ని అందించనుందన్నారు. మూడు కోట్ల మహిళా బడ్జెట్లో లక్షల మంది తెలంగాణ మహిళల కు ఉపాధి కలిగే అవకాశం ఉందన్నారు. 20లక్షల వరకు గల ముద్ర రుణాలు తెలంగాణ రాష్టాన్రికి కూడా వర్తిస్థాయన్నారు. ప్రధానమంత్రి అవాస్ యోజన కింద గ్రావిూణ పట్టణ ప్రాంతాల్లో నిర్మించే మూడు కోట్ల ఇళ్లలో తెలంగాణకు లక్షల ఇళ్లు వస్తాయని ఆయన తెలిపారు.కరీంనగర్‌లో నిర్వహించిన విూడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్, కాంగ్రెస్ 6 గ్యారంటీలు గాడిద గుడ్డు అని ఎద్దేవా చేశారు. 6 గ్యారంటీలను అమలు చేయలేక కేంద్రాన్ని బద్నాం చేసేందుకు కుట్ర చేస్తోందన్నారు. నీతి ఆయోగ్ సమావేశానికి సీఎం రేవంత్‌రెడ్డి డుమ్మా కొట్టడం దుర్మార్గమన్నారు. కేసీఆర్ బాటలోనే రేవంత్‌రెడ్డి నడస్తున్నట్లుంది. సీఎం తీరు తెలంగాణకు పెద్ద నష్టం. భారత్‌ను నంబర్ వన్‌గా తీర్చిదిద్దడం, కేంద్ర రాష్ట్ర సంబంధాలను బలోపేతం చేయడం నీతి ఆయోగ్ సమావేశం లక్ష్యం. ముఖ్యమంత్రికి ముఖం చెల్లకనే నీతి ఆయోగ్ సమావేశానికి వెళ్లలేదు.