గర్భిణిని ఆదుకున్న స్థానికులు
మంచిర్యాల,ఆగస్ట్21(జనం సాక్షి): మానవత్వం ఓ మనిషిని కాపాడింది. గర్భిణిని ఆస్తప్రికి చేర్చింది. మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలో లంబాడి తండా వద్ద ఎర్ర వాగు ఉప్పొంగడంతో సోమవారం సాయంత్రం వరకూ రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అదే సమయంలో జంగల్‌పేట నుంచికాసర్ల సంధ్యారాణి అనే గర్భిణిని ప్రసవం కోసం ఆటోలో ఆసుపత్రికి తీసుకొస్తున్నారు. వాగు ఉప్పొంగడంతో ఆటో నిలిచిపోయింది. కుర్మగుడెం గ్రామానికి చెందిన మహేందర్‌తో పాటు మరికొందరు వెంటనే స్పందించారు. గర్భిణిని చేతులవిూద ఎత్తుకొని వాగు దాటించి అవతలివైపు ఉన్న 108లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. తర్వాత అరగంటకే ఆమె బిడ్డకు జన్మనిచ్చింది.