గల్ఫ్ లో మరణించిన సాయి కుటుంబ సభ్యులను పరామర్శించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమా
జగిత్యాల రూరల్ మండల జాబితా పూర్ గ్రామానికి చెందిన గర్వందుల శ్రీనివాస్ కొడుకు గర్వందుల సాయి కుమార్ ఇటీవల దుబాయ్ లో ఆత్మ హత్య చేసుకొని మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి,పార్థివ దేహాన్ని దుబాయ్ నుండి స్వదేశం తీసుకురావడానికి తన వంతుగా ప్రయత్నం చేస్తానని,దైర్యం గా ఉండాలని,
ఎదిగిన కొడుకు దూరమవడం కుటుంబానికి బాధగా ఉంటుందని చాలా బాధాకరమని అన్నారు రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నారని, గ్రామాల్లో పట్టణాల్లో మౌలిక వసతులు పెంచడం ద్వారా ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని వ్యవసాయ రంగం, భవన నిర్మాణ రంగం, ఐటి, ఫార్మా రంగాలలో అనేక ఉద్యోగ ఉపాది అవకాశాలు ఉన్నాయని, గల్ఫ్ దేశాలకు వెళ్లి యువత నిరుద్యోగులు ఇబ్బంది పడవద్దని నేడు ఇతర రాష్ట్రాల నుంచి ఉద్యోగ ఉపాధి నిమిత్తం తెలంగాణ రాష్ట్రానికి వలసలు పెరిగాయని ప్రతి ఒక్కరూ గమనించాలని,రాష్ట్రంలో లక్ష ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియ ప్రారంభించామని,ప్రైవేట్,ప్రభుత్వ కలిపి 12 లక్షల పైగా ఉద్యోగ నియామకాలు జరిగాయి అని,యువత గమనించాలని,అసత్య ప్రచారాలు నమ్మవద్దు అని అన్నారు ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్.
అనంతరం గ్రామానికి చెందిన రాజుల చంద్రవ్వ అనారోగ్యం తో చనిపోగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎమ్మేల్యే.
వెంట ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచ్ అంకం మమత సతీష్,ఎంపీటీసీ చిత్తరి స్వప్న శ్రీనివాస్,గ్రామ శాక అధ్యక్షుడు జలంధర్,గుండెటి గంగారాం, శ్రీనివాస్, జగదీష్, కుమార్, దిలీపు, వినోద్, మహేష్, లక్ష్మి రజం, రమేష్, నర్సయ్య,రంజిత్,తిరుపతి
మల్లారెడ్డి,విజయ్,తదితరులు ఉన్నారు.